Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్.. పవన్ కు బలమా? బలహీనత?
By: Tupaki Desk | 18 July 2020 2:30 AM GMTపవన్ కు అభిమానులే బలం బలగం.. ఇప్పుడు వారే మైనస్ అవుతున్నారన్న చర్చ సాగుతోంది. అవును నిజమే పవన్ ను అభిమానులే ఓడించారట. వారి అత్యుత్సాహమే జనసేనను ఇంత దాకా తెచ్చిందట.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. స్వయంగా జనసేన అధిపతి పవనే..
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో 2019 డిసెంబర్ లో జరిగిన రైతు సదస్సుకు పవన్ ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు. రైతుల సమస్యలపై ఎమోషనల్ గా ఆవేదనతో మాట్లాడుతున్న పవన్ కు కార్యకర్తలు, అభిమానులు అడ్డు తగిలారు. ఈలలు, గోలలు అత్యుత్సాహంతో పవన్ ను మాట్లాడనీయలేదు. దీంతో సహనం కోల్పోయిన పవన్.. మీరిలా క్రమశిక్షణ లేకపోవడం వల్లే మనం ఓడిపోయాం.. క్రమ శిక్షణ ఉండుంటే జనసేన గెలిచి ఉండేది అంటూ అభిమానులపై ఫైర్ అయ్యారు. అంటే పవన్ కు కూడా తెలుసు.. తన ఫ్యాన్స్ వల్లే తాను ఓడిపోయానని.. అది నిజం..
నిజానికి పవన్ కు ట్విట్టర్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 40లక్షల మంది అభిమానులున్నారు. వారందరూ కనీసం తమ కుటుంబంలోని నలుగురికి జనసేన లక్ష్యాలు, ఆకాంక్షలు చెప్పి.. పవన్ విశ్వసనీయతను విడమరిచి ఉంటే ఏపీ ఎన్నికల్లో జనసేన నిలబడేది.. మెజార్టీ ఓట్లు సాధించేది. ఇలా చేస్తే కనీసం 1.60 కోట్ల మంది జనసేనకు ఓటేసేవారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని ఘోరంగా ఓడిపోయేవారు కాదు.. రెండు చోట్ల పోటీచేసినా.. స్టార్ ఇమేజ్ ఉన్నా పవన్ ఓడిపోయారంటే ఫ్యాన్స్ వేయలేదు.. ఆయన తరుఫున క్యాంపెయిన్ చేయలేదనే అర్థం.
నిజానికి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఒక పులిలాంటి వ్యక్తి.. ఎందుకంటే ఆయనకు 40లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన బర్త్ డేకు రెండు నెలలే ముందే ట్విట్టర్ లో ట్రెడింగ్ సృష్టిస్తూ ఏకంగా 270లక్షల ట్వీట్లు చేశారు. ట్విట్టర్ లోనే ఇదో సంచలనమైన పెద్ద రికార్డ్. ఇలాంటి పట్టుదల ఆయన ఫ్యాన్స్ ఏపీ ఎన్నికల్లో చూపిస్తే కనుక నిజంగానే పవన్ రాజకీయంగా ఎంత ఎత్తులో ఉండేవాడు. కానీ ఆ ఫ్యాన్స్ బలమే బలహీనతగా మారి పవన్ బొక్కబోర్లా పడ్డాడని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ గనుక పవన్ కోసం పనిచేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అంటున్నారు.