Begin typing your search above and press return to search.

పవన్ని లైట్ తీసుకుంటే యమ డేంజరే.... ?

By:  Tupaki Desk   |   5 Nov 2021 11:30 AM GMT
పవన్ని లైట్ తీసుకుంటే యమ డేంజరే.... ?
X
పవన్ కళ్యాణ్ సినిమా హీరో, రాజకీయాల్లో ఆయన చేసేది ఏమీ లేదు, ఎపుడో ఒకసారి వచ్చి మీటింగులు పెట్టి వెళ్లిపోతారు అని అనుకున్నా జనసేన ఉనికిని లైట్ తీసుకున్నా కూడా ఈసారి భారీ నష్టం తప్పదని వైసీపీకి చాలా బాగా అర్ధమవుతోందిట. పవన్ 2019 నాటి మనిషి కారు అన్నదే వైసీపీకి అందుతున్న నివేదికలు స్పష్టం చేస్తున్నాయిట. అధికార పార్టీకి అతి పెద్ద రెడ్ సిగ్న‌ల్ ఏపీలో బలమైన సామాజిక వర్గం నుంచే వస్తోంది అంటున్నారు. కాపులు ఏపీలో ఈసారి తన తడాఖా చూపిస్తారు అంటున్నారు. దేశానికి స్వాత్రంత్రం వచ్చిన తరువాత కాపులు ఏపీలో సీఎం పీఠాన్ని అధిరోహించలేకపోయారు. ఉమ్మడి ఏపీలోనూ, విభజన ఏపీలోనూ వారు చేసిన ఎన్నో ప్రయత్నాలు వమ్ము అయ్యాయి.

అయితే ఈసారి సీన్ అసలు వేరేలా ఉంటుందని అంటున్నారు. కాపులు ఈసారి ఎలాగైనా పవన్ని సీఎం చేయాలని గట్టిగా నిలబడతారు అంటున్నారు. ఈ మేరకు కాపుల్లో పవన్ మానియా బాగానే ఉందని ఇంటలిజెన్స్ వర్గాల నుంచి అధికార పార్టీకి అందుతున్న సమాచారంగా ఉందిట. దీన్ని బట్టి చూస్తే గోదావరి జిల్లాలు మొత్తానికి మొత్తం జనసేనకు టర్న్ అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. నిజానికి ఏపీ రాజకీయాలను శాసించేవి ఈ జిల్లాలే అంటున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినా, 2019 ఎన్నికల్లో జగన్ పవర్ లోకి వచ్చినా కూడా కాపుల మద్దతు వారిని దండీగా లభించబట్టే అంటున్నారు. ఈసారి చూస్తే మాత్రం కాపులంతా పోలరైజ్ అవుతున్నారు అంటున్నారు.

ఈసారి కాకపోతే మరెప్పుడూ అన్నట్లుగా కాపుల్లో చర్చగా వస్తోందిట. ఇంత పెద్ద ఎత్తున జనాభా ఉండి కూడా కాపులకు ముఖ్యమంత్రి పదవి అందని పండుగా ఉండడమేంటన్న ఆవేదన వారిలో ఉందిట. దాంతో కాపులు పవన్ చుట్టూ ర్యాలీ అవుతున్నారన్న నివేదికలు అధికార పార్టీని తెగ కలవరపెడుతున్నాయి. ఉత్తరాంధ్రా, ఉభయ గోదావరి జిల్లాలో కాపులు పెద్ద్ద ఎత్తున ఉన్నారు. ఇక్కడ మొత్తం సీట్లు కలుపుకుని 68 దాకా ఉన్నాయి. ఇందులో మెజారిటీ సీట్లు జనసేన కొల్లగొడితే అధికారంలోకి వైసీపీ తిరిగి రావడం కష్టమే అవుతుంది అంటున్నారు.

దాంతో ఇప్పటి నుంచే మేలుకోవాలని వైసీపీ డిసైడ్ అయీనట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే వైసీపీకి చెందిన కీలక నాయకులు సమావేశమయ్యారు. వారంతా కాపులు వైసీపీకి దూరం కావడం మీదనే చర్చించారు. అతి పెద్ద జనాభా దూరమైతే వచ్చే ఎన్నికల్లో నెగ్గుకువచ్చేదెలా అన్నదే ఈ సమావేశంలో చర్చకు వచ్చింది అంటున్నారు. మరి పవన్ విసురుతున్న ఈ సవాల్ కి జవాబు చెప్పేందుకు వైసీపీని గట్టెక్కించేందుకు కచ్చితంగా ప్రశాంత్ కిశోర్ సాయం కోరాలని కూడా నిర్ణయించారు. అంటే పీకేకు చెక్ పెట్టడానికి మరో పీకే అన్న మాట. మరి అదే కనుక జరిగితే కాపులను దగ్గరకు తీసే వ్యూహామేంటో వైసీపీ పెద్దలకు ప్రశాంత్ కిశోర్ చెప్పగలరా, వైసీపీ మాటలు నమ్మి మరో మారు కాపులు మద్దతు ఇస్తారా అన్నదే సీరియస్ మ్యాటర్. చూడాలి మరి ఏం జరుగుతుందో.