Begin typing your search above and press return to search.
ముస్లిం ఫ్యాన్స్ ని కాకా పడుతున్న పవన్ ...రీజన్ అదేనా !
By: Tupaki Desk | 13 Feb 2020 9:15 AM GMTసినీ స్టార్ , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా ఏమాత్రం కలిసిరావడంలేదు. పార్టీ పెట్టిన కొత్తలో టీడీపీ , బీజేపీ కూటమికి మద్దతు తెలిపి , ఆ తరువాత కొద్ది రోజులకు కూటమి నుండి బయటకి వచ్చి , 2019 ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగాడు. కానీ ,జనసేన మాత్రం సింగల్ సీట్ కే పరిమితం అయ్యింది. పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ లోకి అడుగుపెట్టలేకపోయారు. ఆ తరువాత కొద్దిరోజుల ముందు ఏ వ్యూహం తో బీజేపీ తో పొత్తు పెట్టుకున్నారో కానీ , ఆ పొత్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి మరో కొత్త సమస్యని తెచ్చిపెట్టింది. బీజేపీ తో పొత్తు వల్ల ఓ వర్గం అభిమానులు , జనసేనకు దూరమైపోతున్నారని పవన్ కల్యాణ్ కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
అసలు విషయం ఏమిటంటే ..తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నార్సీ,సీఏఏ ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పై ప్రస్తుతం దేశం మొత్తం భగ్గుమంటుంది. ముఖ్యంగా దేశంలోని ఏ ఒక్క ముస్లిం కూడా ఈ చట్టాన్ని సమర్దించడంలేదు. దీనితో తాజాగా బీజేపీ తో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ...పొత్తు వల్ల కలిగే నష్టాలను వీలైనంత వరకూ తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఎన్నార్సీ,సీఏఏ వల్ల దేశంలోని ఏ ఒక్క పౌరుడికి ఏమి కాదు అని ,కాంగ్రెస్ పార్టీ రాజకీయ మనుగడ కోసం దీనిపై దుష్ప్రచారం చేస్తోందని చెప్పుకొస్తున్నారు.
ఇక ఏపీలో రాయలసీమ ప్రాంతం లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటారు. ఈ క్రమంలో బీజేపీ తో పొత్తు పెట్టుకున్న తర్వాత తొలి సారి రాయలసీమ పర్యటన కి వచ్చిన పవన్ కళ్యాణ్ .. సీఏఏ అంశాన్ని కూడా తన బహిరంగ సభ ప్రసంగంలో ప్రస్తావించారు. సీఏఏపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారం తప్ప, ఇందులో వాస్తవంలేదన్నారు. అదే సమయంలో ముస్లింలకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు. ప్రజలకు అన్యాయం జరిగితే నేను ఊరుకోనని , ఒకవేల ఎవరైనా అన్యాయం చేయాలనీ చూస్తే మొదటగా మీకంటే ముందే నేనే స్పందిస్తానని ముస్లిం వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. దేశపు రక్తపు మూలాల్లోనే సెక్యులర్ భావాలున్నాయని .. మతం పేరుతో రాజకీయాలు చూస్తున్నారని అన్నారు. ఆ మాటలకి మోస పోవద్దు అంటూ హితవు పలికారు. కర్నూల్ లో జరిగిన బహిరంగ సమావేశం లో పవన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేసారు.
అయితే , ఎన్నార్సీ, సీసీఏ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ముస్లింలు దేశ వ్యాప్తంగా అన్నిచోట్లా ఆందోళనలు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో రోజూ ఏదో ఓ చోట నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ లో ముస్లింలు కూడా అధికంగా ఉంటారు. ఒక విధంగా అయితే పవన్ ముస్లిం లు చేసే పోరాటానికి మద్దత్తు ఇచ్చేవారే కానీ , బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ..ఎన్నార్సీ, సీసీఏకి మద్దతు తెలపాల్సిన పరిస్థితి. దీనితో ఒకవైపు పొత్తు ధర్మం పాటిస్తూనే మరోవైపు ముస్లిమ్స్ ఫ్యాన్స్ ని బుజ్జగిస్తున్నారు. అసలు కర్నూల్ కి వచ్చిన పని వేరు ..అక్కడ బీజేపీ ప్రస్తావన తీసుకు రావాల్సిన అవసరం లేదు. అది బీజేపీతో కలిసి చేపట్టిన ర్యాలీ కాదు ..జనసేన చేపట్టిన ర్యాలీ. కానీ , పొత్తు విషయంలో ముస్లింలతో నెలకొన్న అనుమానాలని తీర్చాలనే పవన్ కళ్యాణ్ ఆ వేదిక పై నుండి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.