Begin typing your search above and press return to search.

పవన్.. ఆంగ్లం పై అసలు పాయింట్ మరిచావా.

By:  Tupaki Desk   |   13 Nov 2019 12:03 PM IST
పవన్.. ఆంగ్లం పై అసలు పాయింట్ మరిచావా.
X
ఏపీ సీఎం జగన్ ఎంచుకున్న రాగం ఏంటి.? పవన్ వేసిన తాళం ఏంటని ఇప్పుడు వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ప్రశ్నించడానికి వచ్చిన 'పవనాలు అసలు పాయింట్ ను వదిలి తిమ్మిని బమ్మిని చేయడాన్ని ఎండగడుతున్నారు.

ఏపీ లోని పేద, బడుగు బలహీన వర్గాల కు కూడా ఇంగ్లీష్ మీడియం చదువు అందించాలని ఏపీ సీఎం జగన్ తల పోసి ఇంగ్లీష్ మీడియం చదువుల ను ప్రవేశ పెడుతున్నారు. ఇప్పుడు ప్రపంచమే ఇంగ్లీష్ పై నడుస్తోంది. ఇంకా మన పిల్లలు తెలుగు లో చదవితే వారి భావి జీవితాల ను మనమే నాశనం చేసిన వారవుతాం. భవిష్యత్తు లో అంతా ఆంగ్లంతోనే ఉద్యోగాలుంటాయి. ఈ కనీస జ్ఞానం చదువు రాని వారి కి కూడా తెలుసు..అయితే తేట తెలుగు పై ఉద్యమాలు చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న పవన్ కు తెలియక పోవడమే ఔచిత్యం..

కానీ మన ఘనత వహించిన ఏపీ ప్రతిపక్ష నేతలు మాత్రం ఆంధ్రా అంటేనే తెలుగు.. తెలుగు అంటేనే ఆంధ్రా అంటున్నారు. తెలుగును సీఎం జగన్ చంపేస్తున్నాడంటున్నారు. నిజానికి జగన్ తెలుగు ను ఒక సబ్జెక్ట్ గా తప్పనిసరిగా ఉంచుతూనే ఆంగ్ల మాధ్యమం ప్రవేశం పెడుతున్నారు.. దీనికి జనసేనాని పవన్ కళ్యాణ్ పెద్ద ఉద్యమమనే చేస్తున్నారు. తెలుగు చచ్చిపోతోందని పెడబొబ్బలు పెడుతున్నారు..

తాజాగా సీఎం జగన్.. జనసేన అధిపతి పవన్ ను సూటి గా ప్రశ్నించారు. పవన్ నలుగురు పిల్లలు ఏ మీడియం లో చదువుతున్నారని.? రాష్ట్రం లోని ఏ ఇద్దరు తల్లిదండ్రులు కలిసినా ఇదే ప్రశ్న అడుగుతారు.. పిల్లలు ఏం చదువుతున్నారని.. పవన్ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం, ఇంటర్నేషనల్ స్కూల్ లో చదవాలి.. ఏపీ లోని పేదలకు మాత్రం ఆంగ్ల విద్య అందొద్దు.. ఇదెక్కడి నీతి అని సీఎం జగన్ ప్రశ్నించారు. వెంకయ్య, చంద్రబాబు మనవళ్లు ఏ మీడియం చదువుతున్నారని కూడా ప్రశ్నించారు. ఇదీ అసలు ప్రశ్న? దీనికి పవన్ సమాధానం ఇవ్వాలి..

అయితే దీనికి సూటి గా సమాధానం ఇవ్వాల్సిన పవన్ నిన్న దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడేశారని వైసీపీ శ్రేణులు మండి పడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి ఇంగ్లీష్ పై మోజు ఉంటే తిరుపతి వెంకన్న సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్ లో చెప్పండని సెటైర్ వేశారు. కనీస జ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా తిరుపతి వెంకన్న సుప్రభాతం తెలుగు లో కాదు సంస్కృతం లో వస్తుందని తెలుస్తుంది. పెద్దగా చదువు కోని మన ఘనత వహించిన నేతలకు ఆ మాత్రం కూడా తెలియక పోవడం మన ఖర్మనే మరీ..

ఆంగ్ల భాష ను అక్కున చేర్చుకోవడం అంటే తెలుగు తల్లిని వదిలేయడం కాదు.. తెలుగు తల్లి ఒడిలోంచి ప్రపంచాన్ని గెలవడానికి ఆంగ్లం అవసరం.. మన సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి దక్షిణాది వారు ప్రపంచాన్ని ఏలే సంస్థల ను నడిపిస్తున్నారంటే వారు ఆంగ్లాన్ని అవపోసన పట్టబట్టబట్టే.. పవన్, చంద్రబాబు లాంటి వాళ్లు ముందే పుట్టి ఈ తెలుగు ఉద్యమాలు చేసి ఉంటే సత్య నాదెళ్ల ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యి ఉండేవాడే కాదేమో.. ఆంగ్లం మన ఉన్నతి కి మార్గం చూపుతుంది. అలాంటి ఇంగ్లీష్ విద్యను పేద పిల్లల కు అందకుండా చేస్తున్న ఇలాంటి నేతలు మనకు దొరకడం మన దౌర్భాగ్యం అంటున్నారు పలువురు విమర్శకులు..