Begin typing your search above and press return to search.

పవన్ షాకింగ్ వ్యాఖ్యలు: ప్రభాస్.. మహేశ్ లు నాకంటే పెద్ద హీరోలు

By:  Tupaki Desk   |   22 Jun 2023 9:16 AM GMT
పవన్ షాకింగ్ వ్యాఖ్యలు: ప్రభాస్.. మహేశ్ లు నాకంటే పెద్ద హీరోలు
X
సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారాహి విజయయాత్ర లో భాగంగా కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఉన్నది ఉన్నట్లుగా.. విషయాల్ని కుండబద్ధలు కొడతారన్న పేరున్న పవన్ కళ్యాణ్.. ఇప్పటి వరకు ఎప్పుడూ చెప్పని ఒక కొత్త అంశాన్ని చెప్పుకొచ్చారు. తన బహిరంగ సభల్లో టాలీవుడ్ హీరోల ప్రస్తావన తీసుకొచ్చే ఆయన.. బుధవారం రాత్రి ముమ్మిదివరంలో నిర్వహించిన సభ లో నూ తీసుకొచ్చారు.

హీరోల మీద ఉన్న ఇష్టాన్ని రాజకీయాల్లో చూపించొద్దన్న పవన్.. తన కంటే ప్రభాస్.. మహేశ్ బాబులు పెద్ద హీరోల ని.. ఎక్కువ పారితోషికం తీసుకుంటారని పేర్కొన్నారు. 'మీ అభిమానులు.. ఎన్టీఆర్ అభిమానులు గొడవపడుతుంటారు' అని నాతో కొందరు అంటుంటారని.. కానీ ఎన్టీఆర్, రాంచరణ్ లు గ్లోబల్ స్టార్లుగా అభివర్ణించారు.

సినిమా అనేది వినోదం.. అనందంగా అభివర్ణించిన పవన్ కళ్యాణ్.. తనకు జూనియర్ ఎన్టీఆర్.. మహేశ్ బాబు..రామ్ చరణ్.. అల్లు అర్జున్.. చిరంజీవి.. బాలక్రిష్ణ.. ఇలా ప్రతి ఒక్కరంటే తన కు గౌరవం ఉందని.. వారి తో తాను కలిసినప్పుడు మాట్లాడుతుంటానని చెప్పారు. వారి సినిమాల్ని తానుచూస్తానని చెప్పారు.

సినిమాల పరంగా మీ హీరోల మీద ఇష్టాన్ని రాజకీయాల్లోకి చూపించొద్దన్న పవన్.. ఇక్కడ రైతుకు కులం లేదన్నారు. ప్రభాస్.. మహేశ్ బాబులు తనకంటే పెద్ద హీరోల ని.. ఆ మాట చెప్పటానికి తన కు ఎలాంటి ఇగోలు లేవన్నారు. వారు పాన్ ఇండియా హీరోలన్న పవన్.. వారు తనకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారన్నారు.

రాంచరణ్.. ఎన్టీఆర్ అయితే గ్లోబల్ స్థాయి అని.. వారు తెలిసినంతగా ప్రపంచ వ్యాప్తంగా తాను తెలీయనన్నారు. "ఈ విషయాల్లో నాకెలాంటి ఇగో లేదు. సగటు మనిషి బాగుంటే చాలనుకుంటా. కులపరంగా మన లో మనం గొడవ పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. సినిమాల విషయం లో ఎవరినైనా అభిమానించండి. కానీ.. రాజకీయంగా మాత్రం సమిష్టిగా ఆలోచిద్దాం. పోరాడదాం. పోరాటం చేసే వాళ్లు ఈ సమాజానికి కావాలి. నేనొక్కడినే సరిపో ను. అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించే నాయకులు కావాలి. మీరు ఆ విధంగా తయారు కావాలని కోరుకుంటున్నా" అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.