Begin typing your search above and press return to search.
ఏపీ కాంట్రాక్టర్లకు రూ.1500 కోట్ల బకాయిల విడుదలలోనూ లెక్కా?
By: Tupaki Desk | 19 Jun 2023 7:00 PM GMT'వారాహి విజయ యాత్ర' పేరు తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న సభల్లో కొన్ని కీలక అంశాల్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ అంశాలు మీడియా లోనూ.. సోషల్ మీడియా లోనూ కనిపించని అంశాలే ఎక్కువగా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఆదివారం రాత్రి కాకినాడ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఒక భారీ రహస్యాన్ని రివీల్ చేశారు.
ఈ మధ్యన ఏపీ ప్రభుత్వం రూ.1500కోట్ల మేర కాంట్రాక్టర్ల కు బకాయిలు చెల్లించినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. అందుకు భిన్నంగా కాంట్రాక్టర్లకు రూ.1500 కోట్ల భారీ మొత్తాన్ని బకాయిలు తీర్చేందుకు నిధుల్ని విడుదల చేసిన వైనం తో ఆర్థిక ఇబ్బందులన్న వార్తల్లో నిజం లేదన్న భావన వ్యక్తమైంది.
అయితే.. తాజాగా పవన్ దీనికి సంబంధించిన ఒక సీక్రెట్ ను రివీల్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా షెడ్యూల్ ప్రకారం కాకుండా ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయన్నారు. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి ఎన్నికలు వచ్చే వీలుందన్న జోస్యాన్ని పవన్ చెప్పారు. ఎన్నికల కు ముందు తన వాళ్లకు అవసరమైన నిధుల్ని విడుదల చేశారంటూ పవన్ పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన రూ.1500 కోట్లలో.. తనకుకావాల్సిన కాంట్రాక్టర్లు అయిన మిధున్ రెడ్డి కి రూ.600కోట్లు.. రాఘవ కన్ స్ట్రక్షన్ శ్రీనివాస రెడ్డికి రూ.300 కోట్లు.. ఎంఆర్కేఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థకు చెందిన రఘునాథ్ రెడ్డికిరూ.250 కోట్లు.. వీపీఆర్ ప్రభాకర్ రెడ్డి కి రూ.50కోట్ల చొప్పున చెల్లింపులు జరిపారన్నారు.
మొత్తం రూ.1500 కోట్లలో పవన్ చెప్పిన పేర్లకు రూ.1200కోట్లు కాగా.. మిగిలిన రూ.300కోట్ల ను కూడా తన వారికే చెల్లింపులు జరిపినట్లుగా పేర్కొన్నారు. వారంతా ఎన్నికల్లో పెట్టుబడి పెట్టే వారే కావటంతో వారికి మిగిలినవారి కంటే ముందుగా చెల్లింపులు జరిపినట్లుగా ఒక ఇంజినీర్ తనతో చెప్పినట్లుగా పవన్ పేర్కొన్నారు.
అంతేకాదు.. తనను ఓడించేందుకు రూ.200కోట్ల మొత్తాన్ని సిద్ధం చేశారని.. తాను పోటీ చేసే చోట ఈ భారీ మొత్తాన్ని ఖర్చు చేయాలన్న ఆలోచన లో ఉన్నట్లుగా పవన్ కల్యాణ్ ఆరోపించారు. మొత్తంగా చూస్తే.. ఇప్పటి వరకు ఎవరి నోటి నుంచి వినని కొత్త మాటలు పవన్ నోటి నుంచి రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందంటున్నారు.