Begin typing your search above and press return to search.
పవన్ క్వారంటైన్ దెబ్బకు బీజేపీకి దిమ్మతిరిగే షాక్..
By: Tupaki Desk | 11 April 2021 12:54 PM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్వాంరటైన్ లో ఉన్న విషయాన్ని ఆ పార్టీ ప్రత్యేకంగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తెలియజేసింది. తనకు సన్నిహితంగా ఉండే వారితో పాటు.. వ్యక్తిగత సిబ్బంది చాలామంది కరోనా బారిన పడటంతో.. వైద్యుల సూచనతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా తాను క్వారంటైన్ లోకి వెళ్లినట్లుగా జనసేన పేర్కొంది. వకీల్ సాబ్ విజయవంతం కావటంతో పవన్ అభిమానులు మాంచి జోష్ లో ఉన్న వేళ.. తమ అభిమాన కథానాయకుడు క్వారంటైన్ కు వెళ్లటం నిరాశను కలిగించేదే.
ఇదిలా ఉంటే.. పవన్ తాజా నిర్ణయం.. జనసేన మిత్రపక్షమైన బీజేపీకి పెద్ద ఇబ్బందిగా మారిందని చెప్పాలి. ఎందుకంటే.. సోమవారం బీజేపీ - జనసేనలు సంయుక్తంగా విజయ యాత్రను నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించాల్సి ఉంది. తాజాగా పవన్ క్వారంటైన్ కు వెళ్లాలన్న నిర్ణయాన్ని తీసుకోవటంతో..కమలనాథులకు ఇది మహా ఇబ్బందిగా మారుతుందన్న మాట వినిపిస్తుంది.
ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధర్ తో పాటు.. పవన్ కల్యాణ్ కు హాజరు అవుతారని ఆశించారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామం బీజేపీ నేతలకు మింగుడుపడనిది మారినట్లు చెప్పాలి. పవన్ ఉంటే జనసందోహానికి తిరుగు ఉండదు. పవర్ స్టార్ లేకుండా నిర్వహించే సభకు.. జనసమీకరణ పెద్ద సమస్యగా మారుతుందని చెబుతున్నారు. ఏమైనా పవన్ క్వారంటైన్.. కమలనాథులకు కొత్త చిక్కుల్లోకి నెట్టిందని చెప్పక తప్పదు.