Begin typing your search above and press return to search.

భీమవరంలో పవన్ మార్క్ బ్లాస్టింగ్...!

By:  Tupaki Desk   |   28 Jun 2023 9:31 AM GMT
భీమవరంలో పవన్ మార్క్ బ్లాస్టింగ్...!
X
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తొలి దశ ముగింపు సభను భీమవరంలో డిజైన్ చేశారు. కావాలనే అలా పెట్టుకున్నారు. భీమవరం అంటే అందరికీ ఒక ఆసక్తి, రాజకీయంగా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పాలి. ఇక 2019 ఎన్నికల్లో పవన్ స్వయంగా పోటీ చేసిన నియోజకవర్గం అది.

కచ్చితంగా గెలుస్తాను అని పవన్ ఆశ పెట్టుకున్న సీటు అదే. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ఈ సీటు పవన్ సొంత జిల్లాలో ఉంది. అన్ని సెంటిమెంట్లూ కలగలిపిన భీమవరంలో పవన్ ఓడారు. పవన్ కి గాజువాక కంటే ఎక్కువ బాధ కలిగించిన ఓటమి ఇదని చెబుతారు. భీమవరంలో ఎన్నికల ప్రచారం చేస్తూ పవన్ ఆనాడు అన్న మాటలు ఏంటి అంటే నా సొంత జిల్లా నా ప్రాంతం అని.

అలాంటి చోట ఓడించినందుకు ఈ రోజుకీ ఆయన బాధపడుతున్నారు ఆయన మీద వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్ గెలిచారు. ఆయనకు అన్ని విధాలుగా అండదండగా వైసీపీ అధినాయకత్వం నిలిచింది. ఇదిలా ఉంటే మరో రెండు రోజులలో భీమవరంలో పవన్ బహిరంగ సభ ఉంది. ఆ సభలో పవన్ హై ఓల్టేజ్ స్పీచ్ తో భీమవరం బ్లాస్టింగే అని అపుడే టాక్ వినిపిస్తోంది.

పవన్ సైతం వ్యూహాత్మకంగానే భీమవరం సస్పెన్స్ ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు ఆయనకు ప్రస్తుతం స్వల్ప అనారోగ్యం మూలంగా వారాహి యాత్ర రెండు రోజుల పాటు వాయిదా పడింది. దాంతో అన్నీ కూడగట్టుకుని గట్టి కసరత్తుతొనే పవన్ భీమవరం సభకు వారాహి రధమెక్కి రానున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉండగా పవన్ సభకు ముందే వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు పవన్ సభలకు జనాలు రావడం అంటే ఆయన సినిమా నటుడు కాబట్టే అని లైట్ తీసుకున్నారు. యాంకర్ అనసూయ వచ్చినా జనాలు వస్తారంటూ పవన్ని ఆయన రాజకీయాన్ని తేలిక చేసేలా మాట్లాడారు. ప్రజలు అన్ని విషయాలు తెలుసుకుంటారు. వారు వివేకవంతులు అని కూడా అన్నారు.

పవన్ వారాహి యాత్ర నిండా వైసీపీని విమర్శించడం తప్ప ఏముందని కూడా ప్రశ్నించారు ఆయన ప్రభావం భీమవరంలో ఉండదని అన్నట్లుగా ఎమ్మెల్యే కామెంట్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే పవన్ భీమవరం సభలో తనను ఓడించిన ప్రజలతో పాటు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేను నాలుగేళ్ళుగా సాగుతున్న వైసీపీ పాలనలో భీమవరానికి ఏమి ఒరిగింది, ఏమి జరిగింది అన్న దాని మీద కూడా గట్టిగానే చెబుతారు అని అంటున్నారు.

ఇక చూస్తే వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ మళ్లీ పోటీ చేస్తారు అన్న టాక్ ఎటూ ఉంది. బహుశా ఆ పవర్ ఫుల్ స్టేట్మెంట్ భీమవరంలో ఇచ్చి ఏపీలో పొలిటికల్ హీట్ ని పీక్స్ కి తీసుకెళ్తారా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి చూస్తే భీమవరంలో పవన్ వారాహి యాత్ర సంచలనాలు నమోదు చేస్తుందని జనసైనికులు చెబుతున్నారు. అంతా వెయిటింగ్ మరి.