Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ఇంత వీక్ నా...?

By:  Tupaki Desk   |   19 Jun 2023 11:00 PM GMT
పవన్ కళ్యాణ్ ఇంత వీక్ నా...?
X
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదేళ్ళు అయింది. ఆయన ఇప్పటికి డైరెక్ట్ గా రెండు ఎన్నికల ను చూశారు. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చూసుకుంటే ఇంకో ఎన్నిక చూశారు. ఆ విధంగా ఆలోచిస్తే ఆయన కు ఏపీ రాజకీయలు కొట్టిన పిండి అయి ఉండాలి. అదే టైం లో ఏపీ రాజకీయాల్లో ఈ పాటికి పూర్తి అనుభవం కూడా వచ్చి ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీ పెట్టిన పదేళ్ల తరువాత కూడా కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చినట్లుగా స్టేట్మెంట్స్ ఇస్తూంటారు.

అంతే కాదు ఆయన ఏపీ రాజకీయాల మీద కొత్త వారిలా బయట నుంచి వచ్చిన వారిలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూంటారు. ఏపీ రాజకీయాలు అంటే సంకుల సమరం. ఆ విషయం అందరికీ తెలుసు. ఎందరో మహామహులు ఏపీ ని ఏలారు. మరెందరో ముఖ్యమంత్రులు అయ్యారు. కేంద్ర మంత్రులు అయ్యారు. దశాబ్దాల పాటు ఏపీ రాజకీయాలను శాసించారు. అయినా వారికి ఏపీ పాలిటిక్స్ అంటే పూర్తిగా తెలుసు.

ఇక్కడ కుల భావన బలంగా ఉంటుంది. దాన్ని ఎవరూ తప్పించలేరు. కాబట్టే దాన్ని ఆసరా చేసుకునే రాజకీయం చేశారు. అలాగని కులాల ను రెచ్చొగొట్టి కాదు, ప్రతీ కులాన్ని గౌరవిస్తూనే రాజకీయం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ వైఖరి చూస్తే ఆయన అనేక సార్లు తెలంగాణా తో ఏపీ కి పోలిక పెడుతూ ఏపీ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణా లో కులాలు ఉన్నా దాని కంటే ముందు మన తెలంగాణా అనుకుంటారని, ఏపీ లో మాత్రం మన ఆంధ్రా భావన రావడం లేదని అన్నారు.

పవన్ ఆవేదన నిజమే కావచ్చు కానీ ఏపీ లో ఉన్నదే కుల సమరం. అది అనాదిగా వస్తోంది. అందుకే సమైక్య ఉద్యమం ఫెయిల్ అయిందని టాక్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే కాకినాడ సభ లో పవన్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. అవేంటి అంటే తాను కులాల ను కలుపుతూ సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను అని. ప్రతీ కులాన్ని ఎవరికి మటుకు వారిని ఆకట్టుకుంటూ పొలిటికల్ గా సోషల్ ఇంజనీరింగ్ చేయడాన్ని అంతా చూశారు. కానీ కులాల ను కలుపుతూ సోషల్ ఇంజనీరింగ్ చేయడం అంటే వినూత్న ఆలోచనగానే చెప్పాలి.

తాను కమ్మల ను రెడ్ల ను కలుపుతున్నారని, కాపులను ఇతర వర్గాలను కలుపుతున్నానని, అంతా ఒక్కటి అన్న భావన ను తెస్తున్నాను అంటూ కాకినాడ సభలో పవన్ మరోసారి కులాల చిట్టా విప్పి చదివారు. ఒక పార్టీకి అధినాయకుడిగా ఉంటూ అనేక సభల లో కులాల గురించి చెప్పడం ఆయా కులాల మీద మాట్లాడడం ఒక్క పవన్ కే చెల్లింది అన్న విమర్శలు ఇప్పటిదాకా ఉన్నాయి.

ఇపుడు మరోసారి ఆయన కులాల గురించి చెప్పారు కేవలం ఏపీ లోని కులాల గురించి మాత్రమే కాదు, తెలంగాణా లోని కులాల గురించి ఆయన మరో పెద్ద చిట్టా చదివారు. ఇలా బాహాటంగా కులాల గురించి ఏకరువు పెడుతూ అంతా కలసి ఉండాలని చెప్పడమే పవన్ మార్క్ పాలిటిక్స్. ఇది కుల సమాజమే. తెలంగాణా లోనూ అలాగే ఉంటుంది. ఆ మాటకు వస్తే ప్రపంచంలో కూడా అన్ని చోట్లా ఇదే తీరున ఉంటుంది.

ఎందుకంటే బేసికల్ గా మనిషి తన ఉనికిని గట్టిగా చాటుకోవాలనుకుంటాడు. ఇంకా ముందుకెళ్ళి తాను ఉన్న సమూహం నుంచి కూడా క్రైడిట్స్ తీసుకోవాలనుకుంటాడు. అది అంతటా జరిగేదే. ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. కులాలు మతాలు లేని సమాజం అని పెద్దలు సమాజోద్ధారకులు చాలా మంది యుగాలుగా చెబుతూ వచ్చినా ఈ రోజుకీ పరిస్థితి అలాగే ఉంది.

కానీ పవన్ మాత్రం తాను కులాల ను కలుపుతూ సోషల్ ఇంజనీరింగ్ చేశానని చెప్పడం విశేషం. అది కూడా పదేళ్ల రాజకీయ అనుభవంతో కేవలం ఒక్క జిల్లాలో ఆయన ఇలా సోషల్ ఇంజనీరింగ్ చేస్తే మిగిలిన ఏపీ లో సోషల్ ఇంజనీరింగ్ అన్నది ఎపుడు చేస్తారు. అది ఎప్పటికి అయ్యేనూ అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఇలా పవన్ రాష్ట్రమంతా సోషల్ ఇంజనీరింగ్ చేయడానికి వందేళ్ళ టైం పడుతుందేమో అన్న సెటైర్లు కూడా పేలుతున్నాయి. అయినా పవన్ కులం లేదు అంటూ ఒక వైపు చెబుతూ మరో వైపు మనలో కుల భావన లేకపోవడం వల్లే ఓడిపోయా ను అని గతం లో ప్రకటనలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. వీటిని చూసిన వారు పవన్ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ ఏంటి, దాని అర్ధం పరమార్ధం ఏంటి అన్న దాని మీద చర్చిస్తున్నారు.