Begin typing your search above and press return to search.

బీజేపీని ఫుల్ హ్యాపీ చేసిన పవన్... ?

By:  Tupaki Desk   |   14 Nov 2021 12:30 AM GMT
బీజేపీని ఫుల్ హ్యాపీ చేసిన పవన్... ?
X
పవన్ కళ్యాణ్ జనసేన సారధిగా ఏపీలో తన రాజకీయ రధాన్ని జోరుగానే నడిపిస్తున్నారు. తిరుపతి లోక్ సభ  ఉప ఎన్నికల తరువాత జనసేన చేసే కార్యక్రమాలు అన్నీ కూడా సొంతంగానే ఉంటూ వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ సడెన్ గా పవన్ తమ పార్టీ పోటీ చేయదు అని ప్రకటించేశారు. ఆ సమయంలో ఆయన సాటి మిత్ర పక్షం బీజేపీతో కనీసం చర్చించకుండా ఏకపక్షంగా డెసిషన్ తీసుకున్నారని కమలనాధులు కాస్తా అలిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక బద్వేల్ లో బీజేపీ పోటీ చేసింది. పవన్ మద్దతు ఉంటుందని వారు  చెప్పినా ఆయన నోటి నుంచి ఒక్క ప్రకటనా రాలేదు.

దాంతో పాటు ఆ వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద పవన్ ఉద్యమ శంఖారావం పూరించారు. దాంతో ఈ రెండు పార్టీల చెలిమికి బ్రేక్ పడిపోయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ నాటి సభలో పవన్ పూర్తిగా వైసీపీ మీదనే కామెంట్స్ చేశారు. బీజేపీ ఊసు ఎక్కడా ఎత్తలేదు. దాంతో కమలనాధులలో కాస్తా నిబ్బరం కలిగింది. దాన్ని మరింత పెంచేలా లెటెస్ట్ గా రిలీజ్ చేసిన ఒక ప్రకటన  ఉందని అంటున్నారు. ఏపీలో లోకల్ బాడీస్ కి జరుగుతున్న ఉప ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని ప్రజలను పవన్ అడుగుతూనే  అదే నోటితో తమ మిత్ర పక్షం బీజేపీ ఉన్న చోట ఆ అభ్యర్ధులను కూడా గెలిపించాలని గట్టిగా కోరుకున్నారు.

ఈ స్టేట్మెంట్ తో బీజేపీ నేతలు ఫుల్ జోష్ అవుతున్నారు. పవన్ తో తమ మిత్రబంధం ఎప్పటికీ  వీడదని, తామిద్దరూ కలసి 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని కూడా చెప్పేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ ఆలోచనలు ఏంటి, బీజేపీతో ఆయన రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్నది కనుక విశ్లేషించుకుంటే ఆయన ఆ పార్టీకి గుడ్ బై కొట్టేది లేదనే అంటున్నారు. దానికి గల కారణాలు పరిశీలిస్తే కేంద్రంలో మోడీ సర్కార్ ని ఢీ కొట్టే విపక్షం ఏదీ జాతీయ స్థాయిలో లేకపోవడమే అంటున్నారు. ఇక ఏపీలో బలమైన  వైసీపీని ఎదిరించి నిలబడాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జట్టులో ఉండడమే సేఫ్ అని కూడా జనసేన నాయకులు  భావిస్తున్నారు అని తెలుస్తోంది.

ఇంకో వైపు చూస్తే టీడీపీతో కూడా కలసి నడవాలని జనసేనకు ఉన్నా దాని కోసం బీజేపీని ఎందుకు వదులుకోవాలి అన్న చర్చ కూడా వస్తోందిట. ఇక ఏపీలో టీడీపీ బీజేపీల మధ్య ఇప్పటికిపుడు బంధం లేకపోయినా ఎన్నికల ముందు కచ్చితంగా కుదురుతుంది అంటున్నారు. దానికి తన వంతుగా ప్రయత్నాలు పవన్ కూడా చెస్తారని అంటున్నారు. అంటే 2014 నాటి కూటమిని 2024లో రిపీట్ చేయడానికే పవన్ మొగ్గు చూపుతున్నారు అంటున్నారు. బీజేపీ నేతలు కూడా టీడీపీతో పొత్తులకు ఇప్పటి నుంచే ఎస్ అని చెప్పకుండా ఎన్నికల ముందు దాకా సస్పెన్స్ లో ఉంచి బెట్టు చేస్తే సీట్ల బేరాలు బాగా కుదిరే చాన్స్ ఉందని భావిస్తున్నారని టాక్. మొత్తానికి ఏపీలో బీజేపీ జనసేన బంధం బహు గట్టిది అని పవన్ లేటెస్ట్ స్టేట్మెంట్ నిరూపించింది అంటున్నారు. సో, కమలనాధులు బేఫికర్ గా ఉండొచ్చు.