Begin typing your search above and press return to search.

తెలంగాణా వైపు పవన్ చూపు

By:  Tupaki Desk   |   12 Oct 2022 3:28 PM GMT
తెలంగాణా వైపు పవన్ చూపు
X
ఎపుడు చూసినా ఏపీ రాజకీయాలా మీదనే పవన్ ట్వీట్లు వేస్తారు. ప్రెస్ నోట్లు ప్రెస్ మీట్లు, మీటింగ్స్ అన్నీ కూడా ఏపీలోనే ఏపీ గురించే సాగుతూ ఉంటాయి. అయితే పవన్ ఉండేది తెలంగాణాలో. ఆయనకు ఏపీ కంటే కూడా ఎక్కువ సమస్యలు అక్కడే తెలుస్తాయి. కానీ ఎందుకో ఆయన తెలంగాణా రాజకీయల మీద పెద్దగా ఫోకస్ పెట్టడంలేదు.

అయితే తెలంగాణాలో కేసీయార్ పాలన బాగుందని పవన్ అపుడపుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు. దాంతో ఆయన రాజకీయ క్షేత్రం ఏపీ వరకే పరిమితం చేసుకున్నారు అని అనిపించకమానదు. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ తాజాగా తెలంగాణా సమస్యల మీద పెదవి విప్పారు. ఏపీ వైపున్న చూపును కాస్తా తెలంగాణ వైపుగా మళ్ళించారు.

తెలంగాణాలో ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఆడపిల్లలు సరైన బస్సు సదుపాయం లేక అవస్థలు పడుతున్నారు అంటూ పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. . రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్ధినులు ఈ విధంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ తెలంగాణా మంత్రి కేటీయార్ తో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. వారి విషయంలో ఆలోచన చేయాలని కోరారు.

వారికి సమయానికి బస్సులు లేకపోవడంతో నడచి ఇంటికి వస్తున్నారని, అది అటవీ ప్రాంతం కావడంతో భయపడుతున్నారని కూడా పవన్ పేర్కొనడం విశేషం. ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్ధినులు ఆడబిడ్డల కోసం బస్సులను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

దీని మీద తెలంగాణా ప్రభుత్వం దృష్టి సారించకపోతే మధ్యలోనే చదువు ఆపేసే ప్రమాదం ఉందని కూడా పవన్ పేర్కొన్నారు. మొత్తానికి పవన్ తెలంగాణా మీద ఇపుడు చూపు సారించారు అని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఏమిటి న్నదే చర్చగా ఉందిపుడు.

ఒక వైపు టీయారెస్ జాతీయ పార్టీగా బీయారెస్ గా మారుతోంది. మరో వైపు కేసీయార్ పట్ల పవన్ గతంలో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. కేటీయార్ పవన్ సినిమా ఫంక్షన్ కి వచ్చి ఆకాశానికి ఎత్తేశారు. మరి ఏపీలో ఈ రెండు పార్టీలు కలుస్తాయని చర్చ సాగుతోంది. ఇపుడు పవన్ తెలంగాణాలో సమస్యల మీద ప్రస్తావన తేవడం ద్వారా అక్కడ కూడా యాక్టివ్ గా ఉండదలచుకున్నారా అన్నదే చర్చగా ఉంది మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.