Begin typing your search above and press return to search.

మంచి టైమింగ్ తో దిగిపోయిన పవన్... ?

By:  Tupaki Desk   |   31 Oct 2021 1:17 PM GMT
మంచి టైమింగ్ తో దిగిపోయిన పవన్... ?
X
పవన్ కళ్యాణ్ సినిమా హీరో కమ్ పొలిటీషియన్. ఆయన రాజకీయం చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నారు. అది భుక్తి కోసం, ఇది సేవ కోసం. ఇలా రెండు పడవల మీద కాలు పెడుతూ తన సక్సెస్ రూట్ నీ బాటనీ సెట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ ఏపీలో ఇప్పటిదాకా ఎక్కడ మీటింగు పెట్టుకున్నా వైసీపీయే తొలి టార్గెట్ అవుతుంది. అది నాడూ నేడూ కూడా చాలా కామన్. కానీ పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ మాత్రం కమలం పార్టీలో పెద్ద ఎత్తున కలవరం రేపుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ పవన్ చేపడుతున్నా ఈ ఉద్యమం కచ్చితంగా బీజేపీకే సెగ తగిలేలా ఉంది. బీజేపీని పూర్తిగా పక్కన పెట్టి పవన్ ఫ్యూచర్ పాలిటిక్స్ చేస్తారా అన్న డౌట్లకు కూడా ఈ సభ సమాధానం చెప్పనుంది.

ఇక పవన్ ఎంచుకున్న టైమ్ టైమింగ్ బట్టి చూస్తే బీజేపీకి తలాక్ అనే అంటారు అని విశ్లేషణలు ఉన్నాయి. అదెలా అంటే బీజేపీ పవన్ని కాదని మరీ బద్వేల్ ఉప ఎన్నికల పోరులోకి దూకింది. అక్కడ కనీసం మద్దతుగా ప్రచారం కూడా చేయని పవన్ బద్వేల్ పోల్ ముగిసిన మరుసటి రోజే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి వ్యతిరేకంగా సౌండ్ చేస్తున్నారు అంటే అది కచ్చితంగా ఆ పార్టీ యాంటీ స్టాండే అని అంటున్నారు. అంటే నోటితో చెప్పకుండానే తన అజెండా ఏంటో ఈ పాటికే బీజేపీకి పవన్ క్లారిటీగా చెప్పేశాడు అనుకోవాలి.

ఇక జనసేనలో కూడా బీజేపీ తో పొత్తు మీద చాలా చర్చలు సాగుతునాయి. ఆ పార్టీ విశాఖ నేత శివశంకర్ అయితే బీజేపీతో మాకు అన్ని విషయాల్లో పొత్తు ఉండదు అంటూ కుండ బద్ధలు కొట్టేశారు. బీజేపీ ఫిలాసఫీ వేరు, మా సిద్ధాంతాలు వేరు అంటూ కూడా చెప్పేశారు. బీజేపీ ఏదేదో చేస్తే మేము అన్నింటికీ మద్దతు ఇవ్వాలా అంటూ లాజిక్ పాయింట్ ని లేవనెత్తారు. ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో తాము మొదటి నుంచి స్పష్టంగా ఉన్నామని ఎట్టి పరిస్థితిలో ప్రైవేట్ పరం కానీయమని కూడా ఆయన చెప్పేశారు. తమ నాయకుడు పవన్ దీని మీద కేంద్ర పెద్దలను కలసి కూడా ఏపీ ప్రజల వేదనను వివరించారని కూడా గుర్తు చేశారు.

మొత్తానికి బీజేపీ ఇన్నాళ్ళూ పొత్తుల పేరిట పెద్దన్న పాత్ర పోషిస్తూ జనసేనను సైడ్ చేస్తోంది. దాంతో విసిగి వేసారిన పవన్ చివరికి ఇలా ఉక్కు దెబ్బ కొడుతున్నారని అంటున్నారు. దీని వల్ల జనసేనకే గరిష్టంగా రాజకీయ లాభం కలుగుతుంది అంటున్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమర శంఖం పూరిస్తే దానికి ఉత్తరాంధ్రా నుంచి బ్రహ్మాండమైన మద్దతు దక్కుతుంది. అదే టైమ్ లో బీజేపీ విధానాల మీద జనాలు పూర్తిగా మండిపడే ప్రమాదం ఉంది. సో పవన్ తన రూటే సెపరేట్ అంటున్నారు. బీజేపీకి బీపీ తెప్పించేస్తున్నారు. మరి కమలం కలరవపడినా కలత చెందినా కూడా కుదిరే సీన్ ఉండదేమో.