Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి..ప‌వ‌న్...మ‌ధ్య‌లో బాబు డిమాండ్‌

By:  Tupaki Desk   |   18 Jan 2020 4:37 PM GMT
అమ‌రావ‌తి..ప‌వ‌న్...మ‌ధ్య‌లో బాబు డిమాండ్‌
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో టీడీపీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అమరావతి జేఏసీ యాత్రలో, ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఆయ‌న‌ విగ్రహానికి పూల‌మాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు రాజ‌ధానిపై స్పందించారు. ప్రతి ఒక్కరి ఆశలను నెరవేర్చే కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దాల‌నే ల‌క్ష్యాన్ని తాము పెట్టుకున్న‌ట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ ఎక్కడున్నా ఆనందపడేలా అమరావతికి రూపకల్పన చేశామన్నారు. అయితే, జ‌గ‌న్ స‌ర్కారు దాన్ని నిర్వీర్యం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

అమరావతి కామధేనువు - సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్ట్ అని చంద్ర‌బాబు అన్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆఫీసులన్నీ ఒకచోటే ఏర్పాటు చేస్తుంద‌ని తెలిపారు. ఇండియా గేట్ వద్ద ఉన్న కార్యాలయాలను అక్కడి నుంచి కేంద్ర ప్ర‌భుత్వం తరలిస్తోందని...ఏపీలో మాత్రం మూడు చోట్ల రాజధానులని అంటున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ ఒక ఉన్మాది, పిచ్చి తుగ్లక్‌ను మించిపోయాడని మండిపడ్డారు. 30 రాజధానులు పెడతామని పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతి ఇక్కడే ఉండాలని - అమరావతిని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి ఇబ్బందుల్లో ఉందని రాష్ట్రమంతా బాధ పడుతోందని...అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడటంలేదని మండిపడ్డారు. రాజధానిపై వైసీపీ ఎంపీలు - ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదన్నారు. మూడు రాజధానులు వద్దని జగన్‌కు వైసీపీ నేతలు చెప్పాలని కోరారు. జగన్‌ చేతకాని సీఎం అంటూ ధ్వజమెత్తారు.

కాగా, బీజేపీ జ‌న‌సేన పొత్తుపై స్పందిస్తూ, అమరావతి కోసం ఆ రెండు పార్టీలు పోరాటం చేస్తే సంతోషిస్తామని చంద్ర‌బాబు అన్నారు. బీజేపీ, జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తే అభినందిస్తామని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. త‌ద్వారా త‌మ‌తో క‌లిసి రాక‌పోయినా ప‌ర్లేదు కానీ తమ అజెండాను అనుస‌రించాల‌నే భావ‌న‌ను వ్య‌క్త‌ప‌రిచారు. కాగా, త‌మ‌తో క‌లిసి న‌డిచిన ప‌వ‌న్ బీజేపీకి ద‌గ్గ‌ర‌వ‌డం, ఒక‌నాటి మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ త‌మ‌ను ప‌ట్టించుకోక కొత్త మిత్రుడిని వెతుక్కోవ‌డంపై చంద్ర‌బాబు స్పందించ‌లేదు.