Begin typing your search above and press return to search.
ప్రకాశం మీద పవన్ ఫోకస్
By: Tupaki Desk | 12 Jan 2017 5:57 PM GMTవిమర్శలు.. ఆరోపణలతో రాజకీయాన్ని చేయటం తెలిసిందే. అందుకు భిన్నంగాప్రజాసమస్యలపై దృష్టి సారించి.. దశాబ్దాల తరబడి సా..గుతున్న సమస్యలపై సమరశంఖం పూరించటమే కాదు.. న్యాయమైన డిమాండ్లను తీర్చే విషయంలో ప్రభుత్వాలు ఎంత అలసత్వంతో వ్యవహరిస్తున్నాయన్న విషయాన్ని తన పర్యటనలతో చాటి చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఏపీలో నెలకొన్న సమస్యలపై తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్న పవన్.. ఏపీకి కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదా మొదలు.. ఉద్దానం సమస్య దాకా జనం కోసం.. జనం ఎదుర్కొంటున్న సమస్యల మీదనే గళం వినిపించిన పవన్.. తర్వాత తన దృష్టిని ఏటు సారించనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉరుము.. మెరుపు లేకుండా ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయంతో తిరుపతిలో బహిరంగ సభను నిర్వహించి.. ఆ తర్వాత కాకినాడలో భారీ ఎత్తున సభను పెట్టిన పవర్.. తర్వాత అనంతపురంలలో సభలు పెట్టి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పారు.
తూర్పు గోదావరిజిల్లాలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని మెగా అక్వా ఫుడ్ పార్క్ పై తన అభ్యంతరాల్ని తెలియజేసిన ఆయన.. తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం మీద గళం విప్పి.. ప్రజాసమస్యల పరిష్కార సాధనకు తాను ఉన్నానన్న భరోసా ఇస్తున్న పవన్.. తర్వాత ఎక్కడికి వెళ్లనున్నారు? ఏ అంశాల మీద ఫోకస్ చేయనున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ తర్వాత ఫోకస్ చేసేది ప్రకాశం జిల్లా మీదనని చెబుతున్నారు. ఇప్పటికే పవన్ వర్గీయులు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారని చెబుతున్నారు. ఆ జిల్లాల వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాచారాన్ని సేకరించటంతో పాటు.. ఏ అంశాన్ని పవన్ హైలెట్ చేయాలన్న దానిపై కసరత్తుసాగుతుందని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో భారీ వేదికను ఏర్పాటు చేసి.. ఆ జిల్లా సమస్యల్ని తెరపైకి తీసుకొస్తారని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు సాగితే.. ఈ నెల చివరి వారంలో పవన్ సభకు సంబంధించిన వివరాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. ఇప్పటివరకూ ఎవరూఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్న పవన్.. తన ఒంగోలు పర్యటన సందర్భంగా ఏ అంశాల్ని హైలెట్ చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పుదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/