Begin typing your search above and press return to search.
టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి షాక్ ఇచ్చిన పవన్
By: Tupaki Desk | 8 Dec 2017 12:54 PM GMTజనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అధికార తెలుగుదేశం పార్టీకి..ఎన్నికల నాటి మిత్రపక్షమైన బీజేపీకి పలు షాక్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు ఏకంగా తన సొంత పార్టీ నేతలకే ఆయన షాకిచ్చారు. మూడు రోజులు పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాలు పెట్టుకున్న పవన్ ఈ సందర్భంగా డీసీఐ ఉద్యోగులను పరామర్శించడం - అనంతరం పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఆ తదుపరి ఫాతిమా కాలేజీ విద్యార్థులను కలిసిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యరీతిలో ఆయన టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి షాకిచ్చారు.
ఏలూరులో నివసిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఇంటికి వెళ్లి పవన్ ఆశ్చర్యపరిచారు. రాష్ట్ర ప్రభుత్వంపై - ముఖ్యమంత్రిపై ఘాటు విమర్శలు చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం పలువరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు...జనసేన పార్టీ శ్రేణులను షాక్‌కు గురిచేసింది. ఇటీవలే వివాహం జరిగిన ఎమ్మెల్యే బుజ్జి తనయ లక్ష్మీహాస, అల్లుడు మనోజ్ కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరిణామం పలువురిని ఆశ్చర్యపరిచింది. టీడీపీ నేతలతో పవన్ ఈ తరహా సంబంధాలు నెరపడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా....టీడీపీకి - పవన్ కు ఉన్న దోస్తీకి ఇదే నిదర్శనమని ఆయన విమర్శకులు అంటున్నారు.
కాగా, ఈ పరిణామం వెనుక మరో వార్త వినిపిస్తోంది. బడేటి బుజ్జి దివంగత విఖ్యాత నటుడు ఎస్వీ రంగారావు మనవడు అని తెలుస్తోంది. ఎస్వీ రంగారావుకు - మెగాస్టార్ ఫ్యామిలీకి సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెళ్లి ఉంటారని అంటున్నారు. మరోవైపు జనసేన సెక్రటరీ రాఘవయ్య ఇంటికి పవన్ వెళ్లగా ఎమ్మెల్యే బుజ్జి అల్లుడు రాఘవయ్య మేనల్లుడని తెలుస్తోంది. ఈ క్రమంలో వారు భేటీ అయ్యారని అంటున్నారు. ఏదిఏమైనా...ఈ పరిణామం జనసేన పార్టీ నేతలను షాక్ కు గురిచేసిందని అంటున్నారు.