Begin typing your search above and press return to search.

ఫైజమా పైకి మడిచి మరీ పొలంలోకి దిగిన పవన్

By:  Tupaki Desk   |   2 Dec 2020 10:30 AM GMT
ఫైజమా పైకి మడిచి మరీ పొలంలోకి దిగిన పవన్
X
దూసుకొచ్చిన నివర్.. దాని తీవ్రతను అర్థం చేసుకునేలోపే చేయాల్సిన నష్టాన్ని చేసేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఏపీ.. తమిళనాడు రాష్ట్రాల్ని ప్రభావితం చేసిన ఈ విపత్తు లక్షలాది మంది ప్రజల్ని తెగ ఇబ్బంది పెట్టింది. ఇక.. ఏపీలో అయితే.. నివర్ తుపాను కారణంగా వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు.అన్నదాతల కడగంట్లను స్వయంగా తెలుసుకునేందుకు క్రిష్ణా.. గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

ఈ రోజు (బుధవారం)హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన ఉదయం పది గంటల వేళకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు వందలాది మంది అభిమానులు..కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం కేసరపల్లి.. ఉప్పులూరు.. పునాదిపాడు మీదుగా కంకిపాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పెనుమలూరు.. గోశాల.. పోరంకి మీదుగా కంకిపాడుకు చేరుకున్నారు. పవన్ తో పాటు.. వేలాది మంది ఆయన వెంట ఉన్నారు.

కంకిపాడు క్రాస్ రోడ్డు వద్దకు పవన్ చేరుకోగానే ఆయనపై భారీగా పూలవర్షం కురిపించారు.తన మీద అభిమానం ప్రదర్శిస్తున్న కార్యకర్తలకు.. అభిమానులకు పవన్ అభివాదం చేశారు. తుపాన్ కారణంగా నష్టపోయిన పంటను చూసిన పవన్ కదిలిపోయారు. వారి కష్టాలు విని కదిలిపోయారు. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో తుపానుకారణంగా నష్టపోయిన వైనంపై ప్రభుత్వాన్ని పరిహారాన్ని ఇవ్వాలని కోరుతానని చెప్పారు.

నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందే వరకు పార్టీ ఈ అంశంపై పోరాడుతుందని మాట ఇచ్చారు.తుపానులో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందే వరకు తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. పవన్ నుచూసేందుకు అక్కడి యూత్ చేరుకున్నారు. దెబ్బ తిన్న పంటను స్వయంగా పరిశీలించేందుకు వెళ్లిన పవన్.. పొలం వద్దకు వెళ్లాక.. కాస్త సంకోచించారు. ఆ వెంటనే తన ఫైజుమాను పైకి లాగి.. రైతుల ఆవేదనను జాగ్రత్తగా విన్నారు. వారి కష్టాల్ని విని చలించిపోయారు. చేతనైనంత సాయాన్ని ప్రభుత్వం నుంచి రైతులకు అందేలా ఒత్తిడి పెడతానని హామీ ఇచ్చారు.