Begin typing your search above and press return to search.

పీకే స్టేట్ మెంట్స్ వీక్ గా ఉన్నాయా?

By:  Tupaki Desk   |   5 Nov 2019 8:27 AM GMT
పీకే స్టేట్ మెంట్స్ వీక్ గా ఉన్నాయా?
X
అవే తాట తీతలు, అవే వార్నింగులు.. ఎన్నికల ముందు ఎలా మాట్లాడారో..ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతూ ఉన్నారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. ఎన్నికల ముందు అలా మాట్లాడి పవన్ కల్యాణ్ సాధించింది ఏమీ లేదు. ఆఖరికి తను ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయారు. జగన్ విషయంలో అనుచితంగా మాట్లాడి మరింత డ్యామేజ్ చేసుకున్నారు జనసేన అధిపతి. విశేషం ఏమిటంటే.. ఇప్పటికీ పవన్ ఏమీ మారలేదు!

ప్రజా తీర్పును అయినా అవహేళన చేస్తున్నాడు కానీ, తన తీరును మాత్రం పవన్ కల్యాణ్ మార్చుకోవడం లేదు. జగన్ మీద , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద వ్యక్తిగత విమర్శలకు కూడా పవన్ వెనుకాడటం లేదు. తను వ్యక్తిగత విమర్శలు చేయనని చెప్పుకుంటూ.. వైసీపీ వారి విషయంలో మాత్రం మళ్లీ అవే మాటలే మాట్లాడుతూ ఉన్నాడాయన.

ఆ సంగతలా ఉంటే.. తన పార్టీ జనాల్లోకి చొచ్చుకుపోయే నినాదాలు కానీ, తనపై నమ్మకం కలిగే విధానాలను మాత్రం ఇప్పటికీ పవన్ కల్యాణ్ ప్రకటించలేకపోతూ ఉండటం గమనార్హం. ఇసుక మార్చ్ లో పవన్ కల్యాణ్ పేలవమైన ప్రసంగమే చేశారు.

పవన్ కల్యాణ్ ఎంచుకున్న సమస్యకూ, మాట్లాడిన మాటలకూ, ఉద్యమించిన తీరుకు ఏ మాత్రం సంబంధం లేకపోవడం గమనార్హం! ఆఖరికి స్టూడెంట్స్ కు సెలవు రోజును ఎంచుకుని మరీ పవన్ కల్యాణ్ తన ప్రోగ్రామ్ చేశాడనే అపవాదును ఎదుర్కొంటూ ఉన్నారు!

ఇక సీఎస్ బదిలీ విషయంలో కూడా అదే పేలవమైన ప్రసంగాన్ని చేశారు పవన్ కల్యాణ్. ఇలాంటి వీక్ స్టేట్ మెంట్స్ తో పవన్ కల్యాణ్ ఎవరిలోనూ ఆసక్తిని రేకెత్తించలేకపోతూ ఉన్నాడు, తను పొలిటికల్ మేలేజీని పొందలేకపోతూ ఉన్నాడని విశ్లేషకులు అంటున్నారు.