Begin typing your search above and press return to search.

మ‌హాన్యూస్ చాన‌ల్ బినామీ పేరు చెప్పిన ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   20 April 2018 11:29 AM GMT
మ‌హాన్యూస్ చాన‌ల్ బినామీ పేరు చెప్పిన ప‌వ‌న్‌
X
దాదాపు ఆరు గంట‌ల విరామం త‌ర్వాత మ‌ళ్లీ ట్వీట్లు చేయటం షురూ చేశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. త‌న త‌ల్లిని దారుణంగా అవ‌మానించిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని.. త‌న త‌ల్లిని డ్యామేజ్ చేసేలా చ‌ర్చ‌లు జరిపిన ఛాన‌ళ్ల‌పై ఇప్ప‌టికే మండిప‌డిన ఆయ‌న తాజాగా ఈ త‌ర‌హా చ‌ర్చ‌ల్ని భారీ ఎత్తున చేప‌ట్టిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌హాన్యూస్ టీవీపై ట్వీట్ చేశారు.

స‌ద‌రు ఛాన‌ల్ కు ఆర్థికంగా నిధులు అందించింది టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి అని.. ఆయ‌న కానీ.. ఆయ‌న బినామీ కానీ చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌ని స్ప‌ష్టం చేశారు. అదే స‌మ‌యంలో ఆ చాన‌ల్ సీఈవో.. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ మూర్తి సైతం చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

తన‌పై కుట్ర జ‌రిపిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు సంధించిన టీవీ9 ఛాన‌ల్ పైనా ప‌వ‌న్ తాజాగా మ‌రిన్ని ట్వీట్లు చేశారు. ఈ ఛాన‌ల్లో శ్రీ‌నిరాజు 88.69 శాతం వాటా క‌లిగి ఉన్నార‌ని.. వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌టం ద్వారా ల‌బ్థి పొందాల‌న్న ఉద్దేశంతో చేసిన ప‌నిని ప‌వ‌న్ త‌ప్పు ప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా టీవీ9 ఛాన‌ల్ షేర్ హోల్డ‌ర్స్ లిస్ట్ ను ట్వీట్ చేశారు. అయితే.. ఈ జాబితా 2017ది కావ‌టం గ‌మ‌నార్హం.

శ్రీ‌ని రాజుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోను ట్వీట్ చేసిన ప‌వ‌న్‌.. ఆయ‌న స‌త్యం రామ‌లింగ‌రాజుకు బంధువుగా పేర్కొన్నారు. ఆస‌క్తిక‌రంగా శ్రీ‌నిరాజు ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు కూడా బంధువేన‌ని పేర్కొన్నారు. చూస్తుంటే.. ప‌వ‌న్ త‌న‌ను టార్గెట్ చేసిన వారికి సంబంధించిన వివ‌రాల్ని సేక‌రించ‌టంతోపాటు.. వారి వివ‌రాల లోతుల్లోకి వెళుతున్న‌ట్లుగా తాజా ట్వీట్లు చెప్ప‌క‌నే చెబుతున్నాయ‌ని చెప్పాలి.