Begin typing your search above and press return to search.
ఎన్ని కోట్లు ఖర్చు చేసినా టీడీపీకి ఓటమేనంటున్న పవన్
By: Tupaki Desk | 3 Oct 2018 10:39 AM ISTతెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకుండా చూడటమే సేన లక్ష్యమన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. టీడీపీ విజయం సాధించకుండా ఉండేందుకు తానెంత చేయాలో అంత చేస్తానని స్పష్టం చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.25 కోట్లు.. రూ.50 కోట్ల చొప్పున ఖర్చు చేసినా అంతిమంగా ఓటమే ఆ పార్టీకి మిగులుతుందని చెప్పారు పవన్.
తాజాగా జంగారెడ్డిగూడెంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. ఒక దశలో భావోద్వేగానికి గురయ్యారు. తనకు జీవితాన్ని ఇచ్చిన అన్నను కాదని టీడీపీకి మద్దతు ఇచ్చినట్లుగా చెప్పారు. ఆ రోజు బాబుకు ఎందుకు మద్దతు ఇచ్చానా? అని ఈ రోజు బాధ పడుతున్నానని చెప్పారు. తనకు అనుభవం లేని కారణంగా పెద్దవాడైన బాబుకు మద్దతు ఇచ్చానని.. 2019లో మళ్లీ పవర్ లోకి వస్తామని టీడీపీ భావిస్తే తప్పేనని స్పష్టం చేశారు.
పవర్లోకి వచ్చింది మొదలు వందల ఎకరాల అటవీ భూములు టీడీపీ నేతలు మింగేశారన్న పవన్.. పోలవరం నిర్వాసితులకు అన్యాయం చేశారన్నారు. కనీసం రోడ్లు కూడా వేయలేదన్నారు. సేంద్రీయ వ్యవసాయం పేరుతో వేల కోట్లు అప్పు తెచ్చి ప్రజల నెత్తిన రుద్దారన్నారు. రూ.50వేల కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని రూ.లక్షా యాభై వేల కోట్ల అప్పునకు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు.
ఇదిలా ఉంటే తాను దైవదర్శనం కోసం వెళితే.. రహస్య పూజలు చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. పసిపాపకు విరాళం ఇస్తే స్టింగ్ ఆపరేషన్ చేసి.. డబ్బులు తీసుకుంటున్నట్లుగా విష ప్రచారం చేస్తున్నారన్నారు. తన మీద అదే పనిగా స్టింగ్ ఆపరేషన్లు చేసే మీడియా.. 450 ఎకరాలు కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అన్నను కాదని బాబుకు మద్దతు ఇచ్చినందుకు బాధ పడుతున్నట్లు చెబుతున్న పవన్ లాంటోడు కళ్లు తెరిచేది ఇప్పుడా? అని పలువురు మండిపడుతున్నారు.