Begin typing your search above and press return to search.

ఆవేశాన్ని న‌మ్ముకున్న ప‌వ‌న్‌!

By:  Tupaki Desk   |   3 Dec 2018 10:09 AM GMT
ఆవేశాన్ని న‌మ్ముకున్న ప‌వ‌న్‌!
X
ఆవేశం ఆక‌ట్టుకుంటుంది. కానీ విజ‌యాలు తెచ్చిపెట్ట‌దు. రాజ‌కీయాల్లోకి రావ‌డం అంటే... అన్న‌టికి సిద్ధ‌మై ఉండాలి. ప్ర‌తి మాట‌కు తీవ్రంగా స్పందిస్తే జ‌నాల్లో మ‌ళ్లీ ఆస‌క్తి త‌గ్గిపోతుంది. ఇదంతా ఎవ‌రి గురించి అనుకుంటున్నారా? జ‌న‌సేనాధిప‌తి ప‌వ‌న్ గురించి.

వైసీపీ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తూ *ప‌వ‌న్ క‌ళ్యాణ్ చంద్ర‌బాబు కోవ‌ర్టు. చంద్ర‌బాబు ప‌వ‌న్ వెనుక ఉండి న‌డిపిస్తున్నారు* అని వ్యాఖ్యానించారు. దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా సీరియ‌స్‌ గా స్పందించారు. బొత్స గారూ మీ నాలుక‌ను అదుపులో ఉంచుకోండి... అంటూ ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. విమ‌ర్శ‌ల‌కు విమ‌ర్శ‌లు స‌మాధానం కావాలి గాని వార్నింగ్‌ లు కాదు. నాలుగేళ్లు క‌లిసి ఉండి స‌డెన్‌ గా రాజ‌కీయం చేస్తే ఎవ‌రిక‌యినా అనుమానం వ‌స్తుంది. అందుకే ఆయ‌న అలాంటి వ్యాఖ్య‌లు చేసుండొచ్చు. ఇక్క‌డ బొత్స చేసిన ఆరోప‌ణ రైటా? రాంగా ? అన్న‌ది పాయింట్ కాదు. విమ‌ర్శ‌లో ప‌ద్ధ‌తి ఉందా లేదా అన్న‌దే పాయింట్‌.

విజ‌య‌న‌గ‌రం వ‌స్తాను. అక్క‌డికి వ‌చ్చిన‌పుడు నీ అంతు చూస్తాను అన్న స్థాయిలో ప‌వ‌న్ బెదిరించ‌డం కాస్త విస్మ‌యంగా ఉంది. మ‌రీ ఇంత ఆవేశ‌మైతే ఎలా?... ఎంత‌మందికి ప‌వ‌న్ ఇలా వార్నింగ్‌ లు ఇచ్చి నోరు మూయించ‌గ‌ల‌రు. స‌రైన కౌంట‌ర్ ఇస్తే స‌రిపోయేది గా అంటున్నారు విశ్లేష‌కులు. ప‌వ‌న్ ఆవేశంతో కూడిన రాజ‌కీయాలు చేస్తే ఎంత వేగంగా జ‌నానికి న‌చ్చుతాడో అంతేవేగంగా జ‌నానికి దూర‌మ‌వుతారు అంటున్నారు.