Begin typing your search above and press return to search.

ఎన్నికలు కావాలా పవన్.. ఉన్న సీటూ పోవడానికా?

By:  Tupaki Desk   |   4 Dec 2019 9:22 AM GMT
ఎన్నికలు కావాలా పవన్.. ఉన్న సీటూ పోవడానికా?
X
ఎన్నికలు వచ్చినప్పుడు పొడవలేకపోయాడు కానీ, అప్పుడే ఎన్నికలు కావాలని తెగ ఆరాటపడుతూ ఉన్నాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఎవరికీ తెలీదన్నట్టుగా సాగుతున్న ఈ సినీ నటుడు.. రేపో మాపో మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోతాడని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో పవన్ కల్యాణ్ కొత్త సినిమాలు ప్రారంభం కానున్నాయట.

అయితే ఉన్నట్టుండి ఎన్నికలకు డిమాండ్ చేశారు పవన్ కల్యాణ్. తన సత్తా చూపించాలని ఈయన తెగ ఆరాటపడుతూ ఉన్నాడు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి, రెండు చోట్లా ఓడిన పవన్ కల్యాణ్ ఇలాంటి డిమాండ్ చేయడం ప్రహసనంగా మారుతూ ఉంది.

సాధారణ నేతల మీద ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు పవన్ కల్యాణ్. అది కూడా ఒక చోట కాదు రెండు చోట్ల పోటీ చేసి మరీ ఓడిపోయాడు. అంతే రెండు ఎన్నికలను ఒకేసారి ఎదుర్కొన్నట్టు! అలా ఓడిన పవన్ కల్యాణ్.. ఇంతలోనే ఎన్నికలను డిమాండ్ చేస్తూ ఉన్నారు.

ఇలా మాట్లాడితే నవ్వుకుంటారనే భయం పవన్ కల్యాణ్ కు ఏమాత్రం ఉండదు. అయితే నెటిజన్లు మాత్రం పవన్ ను ఏకేస్తున్నారు. 'రెండు చోట్ల పోటీ చేశావు.. ఒక్క చోటా గెలవలేదు. ఆరు నెలలు అయిపోకనే మళ్లీ అలాంటి అనుభవాలను మూటగట్టుకోవడానికి ఆరాటపడుతున్నావా..' అంటూ నెటిజన్లు పవన్ పై సెటైర్లు వేస్తున్నారు.

'ఇప్పుడు ఎన్నికలు వస్తే.. నీ పార్టీ మొన్నటి ఎన్నికల్లో నెగ్గిన ఒక్క సీటును కూడా కోల్పుతుందేమో పవన్ కల్యాణ్..' అంటూ మరి కొందరు పంచ్ లు విసురుతున్నారు.
ఇంకొందరు పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. 'మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ్.. ఇష్టం అయినప్పుడు చేసుకోవడానికి ఎన్నికలు అంటే పెళ్లిళ్లు కాదు పవన్ కల్యాణ్..' అంటూ మరి కొందరు చురకలు అంటిస్తూ ఉన్నారు.

మొత్తానికి తన మాట తీరుతో ఇలా నవ్వులపాలు అవుతూ, కామెడీ మెటీరియల్ గా మాట్లాడుతున్నాడు పవన్ కల్యాణ్. అయితే ఈ విషయాన్ని ఆయన గ్రహించుకుండా… పూటకో మాట మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నట్టుగా ఉన్నారు!