Begin typing your search above and press return to search.

బయలుదేరిన వారాహి.. జనసేనాని జర్నీ షురూ

By:  Tupaki Desk   |   14 March 2023 5:04 PM GMT
బయలుదేరిన వారాహి.. జనసేనాని జర్నీ షురూ
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన 'వారాహి'.. ఎట్టకేలకు ఏపీకి రావటమే కాదు.. జనసేన ప్రకటించినట్లే పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకు ఎక్కింది. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్.. వారాహి వాహనం మీద ఎక్కి.. అందులో ప్రయాణిస్తున్నారు. విజయవాడలో మొదలైన ప్రయాణం.. మచిలీపట్నం వరకు సాగనుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక ప్రసంగాన్ని చేయనున్నారు. మరో ఏడాది వ్యవధిలో రానున్న ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాల్ని తన ప్రసంగంలో పవన్ ప్రస్తావిస్తారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

వారాహి రోడ్డు మీదకు ఎలా వస్తుందో చూస్తామని అధికారపక్ష నేతలు మాట్లాడిన మాటలు.. అందుకు కౌంటర్ గా.. వారాహిని ఎవరు అడ్డుకుంటారో తానూ చూస్తానన్న పవన్ కల్యాణ్ మాటలకు తగ్గట్లే..

ఆయన ప్రయాణం సాగుతోంది. పవన్ నుచూసేందుకు ఎప్పటిలానే భారీ ఎత్తున జనం రోడ్ల మీదకు రావటం.. పవన్ ను చూస్తూ కేరింతలు కొడుతూ.. సీఎం.. సీఎం.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మరోవైపు.. వారాహి వాహనం టాప్ మీద నిలబడిన పవన్ కల్యాణ్ అందరికి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

వారాహి మీద విజయవాడ నుంచి మచిలీపట్నం వెళుతున్న జనసేనాని చూసేందుకు తరలివచ్చిన జనసందోహం ఒక ఎత్తు అయితే.. ఆయనకు లభిస్తున్న ప్రజాదరణ చూసిన జనసైనికులు తీవ్ర ఆనందానికి గురవుతున్నారు.

పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవన సభకు విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన ప్రయాణం షెడ్యూల్ ప్రకారం సాగుతోంది. విజయవాడ నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరిన పవన్.. ఆటోనగర్ ప్రాంతానికి చేరుకున్నారు.

అక్కడ వారాహి వాహనాన్ని ఎక్కిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి తాడిగడప జంక్షన్.. పోరంకి జంక్షన్.. పెనమలూరు జంక్షన్.. గూడూరు సెంటర్ మీదుగా మచిలీపట్నానికి చేరుకోనున్నారు. వారాహి మీద జనసేనాని ప్రయాణం కన్నుల పండువగా సాగుతుందన్న మాట జనసైనికుల నోటి నుంచే కాదు.. టీవీల్లో లైవ్ చూస్తున్న వారిలోనూ కలగటం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.