Begin typing your search above and press return to search.

త‌న ట్వీట్‌ కి సాక్షి పేప‌ర్ క‌టింగ్ పెట్టిన ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   13 April 2017 9:37 AM GMT
త‌న ట్వీట్‌ కి సాక్షి పేప‌ర్ క‌టింగ్ పెట్టిన ప‌వ‌న్‌
X
ఏపీ రాష్ట్ర రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకోనున్నాయా? నిన్న‌టి వ‌ర‌కూ ఏం జరిగినా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకోని జ‌న‌సేన అధినేత తాజాగా త‌న తీరును మార్చుకుంటున్నారా? తాను మొద‌టి ప్ర‌స్తావిస్తున్న ప్ర‌త్యేక హోదా అంశంపై ఆయ‌న స్టాండ్ మార్చుకున్నారా? హోదా అన్న వెంట‌నే కేంద్ర‌మంత్రి వెంక‌య్య మీద విరుచుకుప‌డే ప‌వ‌న్‌.. అందుకు భిన్నంగా ఏపీ టీడీపీ ఎంపీల్ని టార్గెట్ చేయ‌టం దేనికి సంకేతం? అన్న ప్రశ్న‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఏపీకి ఇస్తామ‌ని చెప్పిన ప్ర‌త్యేక హోదా అంశంపై మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని కేంద్ర‌మంత్రి తేల్చి చెప్పేశారు. ఈ చ‌ర్చ‌లో జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేల‌తో పాటు.. కాంగ్రెస్‌.. టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ప్ర‌త్యేక హోదా చ‌ర్చ‌లో పాల్గొనేందుకు ఏపీ అధికార‌ప‌క్ష‌మైన టీడీపీ ఎంపీలు ఎవ‌రూ హాజ‌రు కాక‌పోవ‌టం అంద‌రికి షాకిచ్చింది. హోదా లాంటి కీల‌క అంశాల్ని బాబు పార్టీ పూర్తిగా విస్మ‌రిస్తుంద‌న‌టానికి తాజా ఉదంతం నిద‌ర్శ‌నంగా మారింది.

అదే స‌మ‌యంలో.. హోదాపై మొద‌ట్నించి తాము చెబుతున్న‌ట్లే జ‌గ‌న్‌ పార్టీ నేత‌లు మాత్రం త‌మ వాద‌న‌ను స‌మ‌ర్థంగా వినిపించారు. ఏపీకి జ‌రుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. హోదా ఇష్యూ మీద జ‌గ‌న్‌ పార్టీ ఎంపీలు వ్య‌వ‌హ‌రించిన‌ తీరుపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇదిలాఉండ‌గా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా ప్ర‌త్యేక హోదా అంశంపై ఈ ఉద‌యం నుంచి వ‌రుస‌పెట్టి ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు.

ఇందులో ప్ర‌త్యేకించి ప్ర‌స్తావించాల్సిన అంశం ఏమిటంటే.. ప‌వ‌న్ ఈసారి త‌న ట్వీట్ల‌కు కొన్ని పేప‌ర్ క్లిప్పింగ్స్‌ ను జ‌త చేశారు. అన్నింటికి మించిన ఆస‌క్తిక‌ర అంశం.. ఆయ‌న సాక్షి ప‌త్రిక‌లో హోదా అంశంపై వ‌చ్చిన వార్త‌ను ట్యాగ్ చేయ‌ట‌మే కాదు.. జ‌గ‌న్ పార్టీ ఎంపీల‌ను ప్రశంసించారు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌గ‌న్ పార్టీపై పాజిటివ్ గా రెస్పాండ్ కాని ప‌వ‌న్‌.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది. తాజాగా రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన హోదా చ‌ర్చ‌తో.. ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం నిజాయితీగా క‌ష్ట‌ప‌డుతున్న పార్టీ ఏమిట‌న్న విష‌యంపై ప‌వ‌న్ క్లారిటీ వ‌చ్చింద‌ని.. అందుకే.. జ‌గ‌న్ పార్టీ చేస్తున్న హోదా ఉద్య‌మానికి త‌న స‌పోర్ట్ ఉంద‌న్న విష‌యాన్ని చాటి చెప్పేందుకు వీలుగా.. సాక్షి పేప‌ర్ క‌టింగ్‌ ను జ‌త చేర్చి ఉంటార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/