Begin typing your search above and press return to search.
పవన్...లేకి ప్రచారానికి ప్రతిరూపం !
By: Tupaki Desk | 3 Dec 2018 5:13 PM GMTవపన్ కల్యాణ్. సినీ హీరో. హీరోయిజంతో యువతను తనవైపు తిప్పుకున్న నటుడు. రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈ హీరో తనకు తాను గొప్పగా ఊహించుకోవడమే ఇప్పుడు సర్వత్రా చర్చరనీయాంశం అవుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన వారికి ముందుగా ఉండాల్సిన స్థితప్రజ్ఞత మాత్రం పవన్ కల్యాణ్ లేకపోవడంపై విమర‌్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిణితిని ప్రశ్నిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడి పాలనపై తిరగబడతానని చెప్పిన పవన్ కల్యాణ్ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తానే కారణమని ప్రజల నుంచి ప్రశ్నలు రావడంతో బహిరంగ సభల్లో ఏం మాట్లాడాలో తెలియన తన అపరిపక్వతని చాటుతున్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి బేషరతుగా మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ ఆయన ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంపై నాలుగు సంవత్సరాలుగా ఏం చేశారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.
ఎన్నికల ముందు ఇలా వైఎస్సార్ పార్టీపై కన్నెర్ర చేయడం పవన్ కల్యాణ్ రాజకీయ నీచత్వానికి నిదర్శనంగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. గడచిన నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడి పాలనపై ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పోరాటం చేస్తుంటే ఆయనపై పవన్ కల్యాణ్ చేస్తున్న విమర‌్శలు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని అంటున్నారు.
నిజానికి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై అధికార పక్ష నాయకులు కూడా పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను తప్పు పడుతున్నారని అంటున్నారు. ప్రతిపక్షనేతపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోకుండా నోటికి వచ్చిన విధంగా మాట్లాడడం పవన్ కల్యాణ్ కే చెల్లిందని అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డిపై జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవాలు లేవనడానికి జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజాస్పందనే నిదర్శనమని అంటున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాస్తవాలకు దూరంగా.... లేకి విమర్శలు చేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.