Begin typing your search above and press return to search.
పవన్ ట్వీట్....సేమ్ టు సేమ్
By: Tupaki Desk | 16 Aug 2015 10:56 AM GMTపవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా తను ప్రజల కోసం ఉన్నానని...పార్టీ పెట్టిందే ప్రజల కోసమే అని చెప్పిన పవన్ ట్వీట్ ల ద్వారా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సుదీర్ఘ సమయం తీసుకున్న తర్వాత తాజాగా రాజధాని నిర్మాణంపై పవన్ తన మనోభావాన్ని చెప్పుకొచ్చారు. రాజధాని కోసం భూ సేకరణ జరపవద్దని స్పష్టం చేశారు. భూ సేకరణ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నానట్లు వివరించాడు. అయితే రెండు రోజుల తాజాగా పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు.
"రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చేందుకు ఇష్టం లేని రైతుల నుంచి భూములు తీసుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం భూ సేకరణ చట్టం ప్రయోగించవద్దని కోరుకుంటున్నాను" అంటూ తాజాగా ట్వీట్ వదిలారు. అయితే రెండ్రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఇదే ట్వీట్ చేశారు. ఇందుకు స్పందనగా ఏపీ పురపాలక శాఖామంత్రి, రాజధాని భూ సమీకరణ బాధ్యతలు చూస్తున్న పి.నారాయణ దీనిపై స్పందించారు. భూ సేకరణ జరపబోమంటూ వివరణ ఇచ్చారు. అయినా తాజాగా పవన్ అదే స్టేట్ మెంట్ తో ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
భూసేకరణ జరుపుతామని ఇప్పటివరకు చంద్రబాబు కానీ లేదా ఆయన ప్రభుత్వం కానీ ఎక్కడా ప్రకటించలేదు. అయినప్పటికీ పవన్ మాట్లాడిన తర్వాత నారాయణ వివరణ ఇచ్చినా పవన్ తన ట్వీట్ లో పాత అభిప్రాయాన్నే వెల్లడించడాన్ని బట్టి చూస్తే ఆయన వ్యాఖ్యలకు చంద్రబాబు స్థాయి నాయకులు ఏమైనా స్పందించాలా అని రాజకీయవర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ ట్వీట్ ఓపినియన్స్ కంటే...క్షేత్రస్థాయిని అర్థం చేసుకొని స్పందించాలని వ్యాఖ్యానిస్తున్నారు.