Begin typing your search above and press return to search.

శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల మిస్సింగ్ ముందే తెలుస‌న్న ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   21 Jun 2018 7:40 AM GMT
శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల మిస్సింగ్ ముందే తెలుస‌న్న ప‌వ‌న్‌
X
తెలుగువారితో స‌హా.. దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు స్వామివారిని ఎంత‌గా కొలుస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. శ్రీ‌వారిగా.. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామిగా.. లార్డ్ బాలాజీగా పేరు ప్ర‌ఖ్యాతులున్న తిరుమ‌ల స్వామి ఆభ‌ర‌ణాల‌కు సంబంధించి సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే.

ఆ మ‌ధ్య వ‌ర‌కూ శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌ధాన పూజారిగా వ్య‌వ‌హ‌రించిన ర‌మ‌ణ దీక్షితుల్ని ఏపీ స‌ర్కారు తొల‌గించ‌టం తెలిసిందే. అయితే.. త‌న‌ను తొల‌గించ‌టంపై ర‌మ‌ణ‌దీక్షితులు ప‌లు ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల మిస్సింగ్‌ పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల్ని చేశారు. శ్రీ‌వారి ఆభ‌ర‌ణాలు మిస్ అయిన విష‌యం గ‌తంలోనే త‌న‌కు తెలుసంటూ చెప్పారు.

గ‌తంలో త‌న‌కు తెలిసిన విష‌యాల్నే ర‌మ‌ణ‌దీక్షితులు చెప్పార‌ని.. ఈ కార‌ణంగానే శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల మిస్సింగ్‌ కు సంబంధించి టీటీడీ మాజీ అర్చ‌కుడు చేసిన వ్యాఖ్య‌లు త‌న‌కేమీ ఆశ్చ‌ర్య‌క‌రంగా అనిపించ‌లేదంటూ ట్వీట్ లో పోస్ట్ చేశారు. ప‌వ‌న్ చేసిన ట్వీట్ చూస్తే.. "కొన్నేళ్ల క్రితం హైద‌రాబాద్ ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఒక సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి క‌లిశారు. ఆ సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల మిస్సింగ్ కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన అంశాల్ని వెల్ల‌డించారు. ఆయ‌న చెప్పిన దాని ప్ర‌కారం శ్రీ‌వారి ఆభ‌ర‌ణాలు మిడిల్ ఈస్ట్ కంట్రీకి ఒక ప్రైవేటు ఎయిర్ క్రాఫ్ట్ లో త‌ర‌లివెళ్లిన‌ట్లుగా చెప్పారు" అని పేర్కొన్నారు.

శ్రీ‌వారి ఆభ‌ర‌ణాల మిస్సింగ్ తో పాటు.. భూముల్ని ర‌క్షించాల్సిన ఏపీ స‌ర్కారు భూకబ్జాల‌కు అండ‌గా నిలుస్తోందంటూ ఏపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ తీరును త‌న వ‌రుస ట్వీట్ల‌తో ఎండ‌గ‌ట్టారు. ఏపీ రాజ‌ధాని కోసం అమ‌రావ‌తిలో సేక‌రించిన భూములు చాల‌ని.. ఇక‌పై రైతుల నుంచి భూములు సేక‌రించొద్ద‌ని చెప్పారు

శ్రీ‌వారికి చెందిన పింక్ డైమండ్ మీద మాట్లాడిన ప‌వ‌న్‌.. దేశం దాటి వెళ్లిపోయిన పింక్ డైమండ్ తో పాటు.. ర‌మ‌ణ దీక్షితులు ప్ర‌స్తావిస్తున్న అంశాల మీద ప్ర‌భుత్వం వెంట‌నే రియాక్ట్ కావాల‌న్నారు. ఆభ‌ర‌ణాల అదృశ్యంపై ప్ర‌భుత్వం ఇచ్చిన వివ‌రణ సంతృప్తిక‌రంగా లేద‌న్నారు. మ‌రి.. దీనిపై బాబు స‌ర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.