Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   31 Oct 2016 3:46 PM GMT
పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
X
జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తాను ప్రస్తుతం ఉన్న సమయంలో రాజకీయాల్ని పార్ట్ టైంగా మాత్రమే చూస్తానని.. ఫుల్ టైం వెచ్చించలేనని చెప్పే ఆయన.. తాజాగా తీసుకున్న నిర్ణయం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారనుంది. ఇప్పటివరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న తన ఓటును.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నమోదు చేసుకునేందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారు.

ఏపీ అధికారపక్షం బలంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో తన ఓటును పవన్ నమోదు చేయించుకోవటం ద్వారా..భవిష్యత్ లో ఆయన చేయనున్న ‘రాజకీయం’ ఎంత సీరియస్ గా ఉండనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఇటీవల గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వివాదంపై స్పందించటమే కాకుండా.. ఈ అంశంపై ఏపీ సర్కారు దృష్టి సారించిన స్వల్ప వ్యవధిలోనే ఆయన.. తన ఓటును మార్చుకోవటమే కాదు.. తనకు అనువుగా ఉండేలా ఒక ఇంటిని కూడా చూడాలని ఆయన కోరటం చూస్తుంటే.. భవిష్యత్ కార్యాచరణపై పవన్ ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నేతలు.. కార్యకర్తలు ఈ రోజు (సోమవారం) పవన్ కల్యాణ్ ను కలిసి.. ఆయన ఓటు హక్కును ఏలూరుకు మార్చుకోవాలని కోరటం.. దీనిపై సానుకూలత వ్యక్తం చేస్తూ.. వారి కోరికను మన్నించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న తన ఓటును ఏలూరుకు మారేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్గాల్ని ఆదేశించటం చూస్తుంటే.. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు షురూ అయినట్లుగా చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/