Begin typing your search above and press return to search.
పవన్ ఖాతాలో ఇంకో టీవీ చానెల్!
By: Tupaki Desk | 24 Oct 2018 1:30 AM GMTజనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు తీపికబురు. ఆయన మీడియా బలం మరింత పెరగనుంది. ఇప్పటికే ఓ తెలుగు పత్రిక - మరో జాతీయ ఛానల్ - ఓ ప్రాంతీయ ఛానల్ మద్దతుతో పవన్ దూసుకుపోతుండగా... ఇంకో టీవీ ఛానల్ త్వరలో యాడ్ కానుందనే వార్తలు వచ్చాయి. పవన్ పార్టీకి మద్దతుగా మూడో టీవీ ఛానల్‌గా సదరు చానల్ నిలవనుందని, దీన్ని ఓ ఎన్నారై ప్రారంభించచున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ ఈ దసరాకు టెస్ట్ సిగ్నల్ అందుబాటులోకి వచ్చేసింది.
మాజీ ఐఏఎస్, జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ సీపీఐ నేతల చేతుల్లో ఉన్న 99 టీవీ ఛానల్‌ను పవన్ పార్టీకి మద్దతుగా ఉండేందుకు కొనుగోలు చేశారు. అలా జనసేనకు పరోక్షంగా ఓ మీడియా చానల్ వచ్చింది. ఇది జరిగిన కొద్దికాలానికి మాజీ మంత్రి ముత్తాగోపాలకృష్ణ జనసేన గూటికి చేరారు. తద్వారా వారి చేతుల్లో ఆంధ్రప్రభ పత్రిక మద్దతు ఇస్తోంది. ఇక గౌతమ్ ఆధ్వర్యంలో ప్రారంభం అవుతున్న ఇండియా అహేడ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ లో ఒక కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ హోస్ట్‌గా రూపకల్పన చేశామని, ఆ కార్యక్రమంలో చేయడానికి అంగీకరించాల్సిందిగా వారు కొద్దికాలం కిందట పవన్ కల్యాణ్‌ను కోరగా ఈ టీవీషో చేయడానికి పవన్ కల్యాణ్ అంగీకారం తెలిపారు. తద్వారా పవన్‌కు ఓ పత్రిక, మరోజాతీయ ఛానల్ తోడయ్యాయి. ఈ క్రమంలో ఓ ఎన్నారై పవన్ కోసం టీవీ ఛానల్ పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. టెక్నికల్ సెటప్ అంతా రెడీ అయిందని, కొన్ని అంశాలు సెట్ అయితే వచ్చే దసరాకే టెస్ట్ సిగ్నల్ అని వెలువరించిన సంగతి తెలిసిందే.
ప్రైమ్9 న్యూస్ పేరుతో పవన్ పై ఉన్న వీరాభిమానంతో ఓ ఎన్నారై తన దగ్గరున్న డబ్బుతో ఈ ఛానెల్ పెట్టారు. ఇప్పటికే టెస్ట్ సిగ్నల్ మొదలైంది. దసరా నాడు టెస్ట్ సిగ్నల్ వచ్చిన ఈ ఛానల్ పవన్ కోసం ప్రత్యేకంగా కార్యక్రమం కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. పవన్‌తో ప్రత్యేకంగా ఫోన్ ఇన్ ప్రోగ్రాం పెట్టనున్నట్లు చెప్తున్నారు. జనసేన భావజాలాన్ని పెద్ద ఎత్తున చాటిచెప్పేందుకు ఈ ప్రోగ్రాంను ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. త్వరలో అవకాశః దొరికతే పవన్‌తో ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలుస్తోంది.