Begin typing your search above and press return to search.
పవన్ ఖాతాలో ఇంకో టీవీ చానెల్
By: Tupaki Desk | 6 Oct 2018 11:23 AM GMTజనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీడియా రంగంలో తన పట్టు పెంచుకుంటున్నారు. ఆయన ఖాతాలో మరో టీవీ ఛానల్ చేరనుంది. ఓ ఎన్నారై ఈ మేరకు పవన్ పై అభిమానంతో టీవీ ఛానల్ పెట్టేందుకు రెడీ అయినట్లు సమాచారం. దీంతో పవన్ పార్టీకి మద్దతుగా మూడో టీవీ ఛానల్ గా సదరు చానల్ నిలవనుందని అంటున్నారు. దీంతో ఓ తెలుగు పత్రిక - మరో జాతీయ ఛానల్ - ఓ ప్రాంతీయ ఛానల్ మద్దతుతో పవన్ దూసుకుపోనున్నారని చెప్తున్నారు.
జనసేన అధినేత పవన్ చేతిలో ఇప్పటికే ఓ టీవీ ఛానల్ ఉన్న సంగతి తెలిసిందే. సీపీఐ నేతల చేతుల్లో ఉన్న 99 టీవీ ఛానల్ ను పవన్ పార్టీకి మాజీ ఐఏఎస్ - జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారు. ఇప్పటికే ఆయనకు ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. అలా జనసేనకు పరోక్షంగా ఓ మీడియా చానల్ వచ్చింది. ఇది జరిగిన కొద్దికాలానికి మాజీ మంత్రి ముత్తాగోపాలకృష్ణ జనసేన గూటికి చేరారు. గౌతమ్ ఆధ్వర్యంలో ప్రారంభం అవుతున్న ఇండియా అహేడ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ లో ఒక కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ హోస్ట్ గా రూపకల్పన చేశామని - ఆ కార్యక్రమంలో చేయడానికి అంగీకరించాల్సిందిగా వారు కొద్దికాలం కిందట పవన్ కల్యాణ్ ను కోరారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే ఈ టీవీ షోను చేయడానికి పవన్ కల్యాణ్ అంగీకారం తెలిపారని జనసేన తెలిపింది. అదే విధంగా ముత్తా గోపాల కృష్ణ జనసేనలోకి రావాల్సిందిగా పవన్ కల్యాణ్ చేసిన కోరగా అందుకు ఆయన సమ్మతించారు. తద్వారా పవన్ కు ఓ పత్రిక - మరోజాతీయ ఛానల్ తోడయ్యాయి. ఇక 99 టీవీ ఎలాగూ ఉంది.
ఇలా ఓ వైపు పవన్ కు మీడియా మద్దతు పెరుగుతున్న క్రమంలో తాజాగా ఓ ఎన్నారై పవన్ కోసం టీవీ ఛానల్ పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టెక్నికల్ సెటప్ అంతా రెడీ అయిందని, కొన్ని అంశాలు సెట్ అయితే వచ్చే దసరాకే టెస్ట్ సిగ్నల్ అని తెలుస్తోంది. ఈ ఛానల్ కు సైతం సెంటిమెంట్ ను ఫాలో అవుతూ...9 అనే అంకె వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ పై ఉన్న వీరాభిమానంతో ఓ ఎన్నారై తన దగ్గరున్న డబ్బుతో ఈ న్యూస్ ఛానెల్ పెడుతున్నారని టాక్. కాగా, తనను తీవ్రంగా ఇరకాటంలో పడేసిన శ్రీరెడ్డి ఎపిసోడ్ సందర్భంగా మీడియా ప్రాధాన్యం గుర్తించిన జనసేనాని ఈ రూపంలో తన పట్టును పెంచుకుటూ ప్రత్యర్థులను ప్రచారయుద్ధంలో ఎదుర్కునేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.