Begin typing your search above and press return to search.

జనసేన అభ్యర్థులు వీరే.. త్వరలోనే ప్రకటన

By:  Tupaki Desk   |   11 March 2019 9:09 AM GMT
జనసేన అభ్యర్థులు వీరే.. త్వరలోనే ప్రకటన
X
దేశంలో ఎన్నికల నగారా మోగింది. ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఏప్రిల్ 11న పోలింగ్.. మార్చి 18నుంచే నామినేషన్ల స్వీకరణ ఉండడంతో అధికార - ప్రతిపక్షాలు అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారక్షేత్రంలోకి దిగేందుకు రెడీ అయ్యారు.

టీడీపీ - వైసీపీ అభ్యర్థుల ఖరారుపై దృష్టి నిలపగా.. ఇరు పార్టీల్లోకి జంపింగ్ లు కూడా తాజాగా మొదలయ్యాయి. ఇక ఎవ్వరికీ మద్దతు ఇవ్వకుండా తొలిసారి ఏపీ ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేన తాజాగా అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. తొలి విడతలో 17మందికి ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినా.. జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ తొలి జాబితాలో 17 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు - నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై జనసేన కానీ - పవన్ కళ్యాణ్ కానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

*జనసేన తరుఫున నిలబడే అభ్యర్థుల ప్రాథమిక జాబితా ఇదేనట..

1. రాజమండ్రి రూరల్ - కందుల దుర్గేష్,
2. గుంటూరు వెస్ట్ - తోట చంద్రశేఖర్,
3. ముమ్మిడివరం - పితాని బాలకృష్ణ
4. తెనాలి - నాదెండ్ల మనోహర్
5. ప్రత్తిపాడు - రావెల కిశోర్‌ బాబు,
6. పాడేరు- పసుపులేటి బాలరాజు,
7. కావలి - పసుపులేటి సుధాకర్,
8.ఏలూరు - నర్రా శేషుకుమార్,
9. కాకినాడ రూరల్ - పంతం నానాజీ,
10. తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాసరావు,
11. రాజోలు - రాపాక వరప్రసాద్,
12. పి.గన్నవరం - పాముల రాజేశ్వరి,
13.ధర్మవరం - మధుసూదన్‌ రెడ్డి,
14. కడప - సుంకర శ్రీనివాస్,
15. పిఠాపురం - అనిశెట్టి బుల్లబ్బాయి,
16. తుని - రాజ అశోక్‌ బాబు,
17. మండపేట - దొమ్మేటి వెంకటేశ్ పేర్లు

అలాగే, ఎంపీ అభ్యర్థులుగా మారిశెట్టి రాఘవయ్య - ఆకుల సత్యనారాయణ - చింతల పార్థసారధి - గేదెల శ్రీనుబాబు పేర్లను జనసేన ప్రకటించనుందని సమాచారం..వీరి పార్లమెంట్ నియోజకవర్గాల పేర్లు తెలియాల్సి ఉంది.