Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఫైరింగ్ ఆలోచ‌నతోనా.. ఆవేశంతోనా?

By:  Tupaki Desk   |   20 April 2018 2:30 PM GMT
ప‌వ‌న్ ఫైరింగ్ ఆలోచ‌నతోనా.. ఆవేశంతోనా?
X
ఎక్క‌డో.. ఏదో మొద‌లైన‌ట్లుగా మొద‌లైన‌ట్లుగా మారింది క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీ‌రెడ్డి పోరాటం. ఈ ఇష్యూతో ఏ మాత్రం స‌బంధం లేకున్నా.. చివ‌ర‌కు ప‌వ‌న్ సైతం బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింది. క్యాస్టింగ్ కౌచ్ మీద త‌న పోరాటం అంటూ బ‌య‌ట‌కు వ‌చ్చిన శ్రీ‌రెడ్డి..ప‌వ‌న్ త‌ల్లిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం.. దీనిపై నిన్న రాత్రి నుంచి ప‌వ‌న్ వ‌రుస ట్వీట్లు చేయ‌టం తెలిసిందే.

త‌న‌ను ప‌దే ప‌దే మీడియా అత్యాచారం చేస్తుందంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న‌కు వ్య‌తిరేకంగా ఏపీ సీఎం బాబు కుమారుడు క‌మ్ మంత్రి లోకేశ్‌.. ఒక ఛాన‌ల్ అధినేత‌.. ఒక ఛాన‌ల్ ముఖ్యుడితోపాటు.. మ‌రో ప్ర‌ముఖ ఛాన‌ల్ కూడా ఇందులో భాగ‌స్వామ్యం ఉంద‌ని ఆరోపించారు.

రాజ‌కీయ నేత‌లు కానీ సినీ రంగ ప్ర‌ముఖులు కానీ త‌మ‌కు జ‌రిగే అన్యాయాల మీద గ‌ళం విప్ప‌టం మామూలే అయినా.. ఎక్క‌డా కూడా వారు మీడియా మీద విరుచుకుప‌డ‌టం ఉండ‌దు. అందుకు భిన్నంగా లోకేశ్‌.. టీవీ 9 శ్రీ‌నిరాజు.. ర‌విప్రకాశ్‌.. ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ పేర్ల‌తో పాటు లోకేశ్ స్నేహితుడు రాజేష్ కిలారుతో అమ‌రావ‌తి స‌చివాల‌యంలో కుట్ర‌కు తెర‌తీసిన‌ట్లుగా ఆరోపించారు.

ఇందుకోసం రూ.10కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లుగా ప‌వ‌న్ ఆరోపించారు. ఒక రాజ‌కీయ పార్టీ అధినేత మీడియాను టార్గెట్ చేయ‌టం ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న‌దే. ఇదేం కొత్త కాకున్నా.. త‌న‌కంటూ ఎలాంటి మీడియా ద‌న్ను లేని ప‌వ‌న్ తానున్న ప‌రిస్థితుల్లో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల మీద దాడి చేయ‌టం స‌బ‌బా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

వాస్త‌వానికి ప‌వ‌న్ త‌న పార్టీని ప్ర‌క‌టించిన‌ప్పుడు.. ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాలు.. ప‌వ‌న్ స‌భ‌ల‌కు భారీగా క‌వ‌రేజ్ ఇచ్చిన ఛాన‌ళ్ల‌లో టీవీ9.. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి రెండు అధిక ప్రాధాన్య‌త ఇచ్చాయి. ఇప్పుడు అలాంటి రెండు ఛాన‌ళ్ల మీద‌నే ప‌వ‌న్ విరుచుకుప‌డ‌టం.. ఆరోప‌ణ‌లు చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అటు తెలంగాణ‌లో కానీ.. ఆంధ్రాలో కానీ ప‌వ‌న్ పార్టీకి అండ‌గా నిలిచే మీడియా సంస్థ లేనే లేద‌ని చెబుతారు. ఇలాంటివేళ‌.. కొద్దో గొప్పో ద‌న్నుగా నిలుస్తాయ‌న్న పేరున్న రెండు ప్ర‌ముఖ ఛాన‌ళ్ల‌ను ప‌వ‌న్ తన ట్వీట్ల‌తో దూరం చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

అయితే.. రాజ‌కీయాల్లోనూ.. మీడియాలోనూ శాశ్వత శ‌త్రుత్వం.. .శాశ్వత మిత్ర‌త్వం ఉండ‌ద‌న్న నానుడికి త‌గ్గ‌ట్లే.. ఇప్ప‌టికి ఫైర్ అయినా ప‌వ‌న్ స‌ద‌రు మీడియా సంస్థ‌ల్ని కూల్ చేస్తారా? లేక‌.. త‌న ఫైరింగ్ తో త‌న‌ను త‌ప్ప‌నిస‌రిగా క‌వ‌ర్ చేయాల్సిన ప‌రిస్థితిని తీసుకొస్తారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఏమైనా.. మీడియా సంస్థ‌ల మీద ప‌వ‌న్ ఆరోప‌ణ‌లు తొంద‌ర‌పాటేన‌ని.. ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. ప‌వ‌న్ కున్న ఇమేజ్ మూలంగా..ప‌వ‌న్ అవ‌స‌రం మీడియా ఛాన‌ళ్ల‌కే కానీ.. ప‌వ‌న్ కు కాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఏమైనా.. మీడియా మీద తొంద‌ర‌ప‌డి రెండు మాట‌లు అనే క‌న్నా.. మరో మార్గంలో ట్రై చేసి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.