Begin typing your search above and press return to search.

అలీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ సానుభూతి...

By:  Tupaki Desk   |   19 Dec 2019 11:29 AM GMT
అలీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ సానుభూతి...
X
ప్రముఖ కమెడియన్ అలీ తల్లి జైతున్ బీబీ గురువారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైతున్ తన స్వస్థలంలో బుధవారం రాత్రి 11.41 గంటలకు కన్నుమూశారు. ప్రస్తుతం రాజమండ్రిలోని అలీ సోదరి నివాసంలో ఉంటున్న ఆమె అక్కడే తుదిశ్వాస విడిచారు. ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్నారు.


ఈ నేపథ్యంలో సినీ నటుడు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఖాతాలో ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. నటుడు అలీ మాతృమూర్తి జైతున్ బీబీ తుదిశ్వాస విడిచారని తెలిసి చాలా బాధ అనిపించింది. బీబీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. అలీకి తల్లితో ఉన్న అనుబంధం ఎంత బలమైందో తెలుసు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ అని పవన్ కళ్యాణ్ ప్రకటనలో తెలిపారు.

జైతున్ బీబీ మృతి విషయం తెలుసుకున్న వెంటనే సినీ ప్రముఖులు అలీ ఇంటికి వెళ్లి సంతాపం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అలీ నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. సీనియర్ నరేష్, మరికొందరు సినీ ప్రముఖులు అలీకి సంతాపం తెలిపారు.

ఇకపోతే తల్లి పై ఉన్న ప్రేమను అలీ వివిధ సందర్భాల్లో గుర్తు చేసుకునేవారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి తల్లితండ్రులే కారణమని చెప్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా ఆమెతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడేవారు. మరోవైపు ఇప్పటికే అలీ తన తండ్రిపేరిట సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. ..