Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌కు జెల్లెకాయ వేస్తూ జ‌గ‌న్ కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు!

By:  Tupaki Desk   |   26 Jun 2019 10:02 AM GMT
త‌మ్ముళ్ల‌కు జెల్లెకాయ వేస్తూ జ‌గ‌న్ కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు!
X
అధికారపక్షం తీసుకునే నిర్ణ‌యాల్ని అదే ప‌నిగా త‌ప్పు ప‌ట్టే ధోర‌ణికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. జ‌న‌రంజ‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న జ‌గ‌న్ చేస్తున్న ప‌నుల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకుంటున్న ఏపీ సీఎం నిర్ణ‌యాల్ని స‌మ‌ర్థించ‌టం ద్వారా త‌న ప‌ట్ల సానుకూల‌త పెంచుకునేట్లుగా క‌నిపిస్తోంది తాజాగా ప‌వ‌న్ మాట‌లు వింటుంటే.

ప్ర‌జావేదిక కూల్చివేత‌పై తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ప్ర‌జాధ‌నంతో క‌ట్టిన‌ప్ప‌టికి అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై త‌మ ప్ర‌భుత్వం ఎంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా ఆయ‌న నిర్ణ‌యం ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ నిర్ణ‌యానికి సానుకూలంగా స్పందించారు ప‌వ‌న్ క‌ల్యాణ్.

ప్ర‌జావేదిక కూల్చివేత నిర్ణ‌యం మంచిదేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అనుమ‌తులు లేని నిర్మాణాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌జావేదిక కూల్చివేత‌తో స‌రిపెట్ట‌కుండా.. మిగిలిన అన్ని అనుమ‌తి లేని భ‌వ‌నాల్ని కూడా కూల్చివేయాల‌న్నారు. అనుమ‌తి లేని భ‌వ‌నాల్ని కూల్చివేస్తేనే.. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌లుగుతుంద‌న్నారు. ఓవైపు ప్ర‌జావేదిక కూల్చివేత‌పై తెలుగు త‌మ్ముళ్లు నానా ర‌చ్చ చేస్తున్న వేళ‌.. జ‌న‌సేన అధినేత జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించ‌టం వారికి జెల్ల‌కాయ‌గా మారింద‌న్న మాట వినిపిస్తోంది.