Begin typing your search above and press return to search.
పీకే సంచలనం..రాజధానిని మారిస్తే మోదీని ధిక్కరించడమేనట!
By: Tupaki Desk | 31 Aug 2019 3:24 PM GMTనవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ వారం రోజులుగా జరుగుతున్న రచ్చపై నిన్న ఎంట్రీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఈ వివాదానికి మరింత వేడి రాజేశారనే చెప్పాలి. నిన్న అమరావతిలో పర్యటించిన పవన్ అమరావతిని రాజదానిగా ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం తో పాటు ఇటు రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామన్న కోణంలో వైసీపీ సర్కారు చేస్తున్న వ్యాఖ్యలపై కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాజాగా శనివారం కూడా ఇదే అంశంపై మాట్లాడిన పవన్... అసలు రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే... ప్రదాని మోదీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ధిక్కరించడమేనని సరికొత్త సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ తరహా కొత్త వ్యాఖ్యతో పవన్ రాజధాని అమరావతిపై తనదైన శైలి రచ్చను మొదలెట్టేశారని చెప్పక తప్పదు. ఈ దిశగా పవన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీకి తెలిపిన తర్వాతే నవ్యాంద్ర రాజధానిగా అమరావతిని ప్రకటించారని పవన్ గుర్తు చేశారు. తనకు తెలిసే... నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన క్రమంలోనే మోదీ సర్కారు... అమరావతి నిర్మాణం కోసమంటూ రూ.1500 కోట్లను మంజూరు చేసిందని కూడా పవన్ గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు నవ్యాంధ్ర రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే... అది మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ధిక్కరించడమే అవుతుందని కూడా పవన్ వ్యాఖ్యానించారు.
మోదీ షాలను ధిక్కరించి ముందుకు సాగడం కుదరదన్న రీతిలో ఈ వ్యాఖ్యలు చేసిన పవన్..రాజధాని తరలింపునకు సంబంధించి రచ్చను మొదలెట్టేసిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కాస్తంత జాగ్రత్తగానే ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇదే ఫ్లోను కొనసాగించిన పవన్..బొత్స ఓసారి తనను ఇరుకున పెట్టేసిన ఫోక్స్ వ్యాగన్ కేసులను గుర్తు తెచ్చుకోవాలని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి తాను ఎంతమాత్రం సమ్మతించనని చెప్పేసిన పవన్... ఈ విషయంలో వైసీపీ సర్కారును బెదిరిస్తున్నట్లుగా కూడా సంచలన కామెంట్లు చేసి ఆసక్తి రేకెత్తించారు.