Begin typing your search above and press return to search.
ఓట్లు చీలనివ్వమంటూనే ఒంటరిగానే...పవన్ వ్యూహమేంటి...?
By: Tupaki Desk | 24 Jan 2023 6:47 PM GMTవచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి తెలంగాణా గడ్డ మీద జనసేన అధినేత పవన్ కళ్యాన్ పెదవి విప్పారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు అన్నవి ఇపుడు ప్రస్తావనార్హం కాదని ఆయన తేల్చేశారు. ఎన్నికలకు వారం రోజుల వ్యవధిలోనే పొత్తులు ఖరారు అవుతాయని ఆయన చెప్పడం విశేషం.
అదే టైం లో తమతో కలసివచ్చే వారితోనే పొత్తులు ఉంటాయని పవన్ సంకేతాలు ఇచ్చారు. తమ వెంట నడవాలనుకునే వారితో కొత్తగా పొత్తులు ఉన్నా ఉండొచ్చు అని ఆయన చెప్పారు. ఇక పొత్తులు విషయానికి వస్తే ఏపీలో బీజేపీతో తమకు పొత్తు ఉందని, అది కొనసాగుతోందని ఒక సందేహాన్ని ఆయన తీర్చేశారు. అంటే ఈ రోజుకీ లైఫ్ లో బీజేపీతో పొత్తు ఉందని పవన్ చాలా కాలం తరువాత చెప్పారన్న మాట.
ఇక 2014 పొత్తులు రిపీట్ అవుతాయా లేదా అన్నది ఆయన స్పష్టంగా చెప్పనప్పటికీ ఓట్ల చీలిక నివారించే ఉద్దేశ్యం తనకు కచ్చితంగా ఉందని చెప్పడం విశేషం. అంటే వైసీపీకి యాంటీగా అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు పోవావాల్సిన అవసరాన్ని మరోమారు పవన్ నొక్కి చెప్పారు.
ఇక పొత్తులు ఉంటే ఓకే లేకపోయినా నో ఫికర్ అన్నట్లుగా పవన్ సంకేతాలు ఇవ్వడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలన్నదే చర్చగా ఉంది. ఏపీలో చంద్రబాబుతో పవన్ ఈ మధ్యనే భేటీ అయి రెండున్నర గంటల పాటు ఏకంగాంతగా మాట్లాడారు. దాంతో రెందు పార్టీల మధ్య పొత్తులు కుదిరిపోయాయని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు కూడా ఆయన మరోమారు ఒంటరిగా అయినా వెళ్తామని బలంగా చెబుతున్నారు.
దాని కంటే ముందు రణస్థలంలో కూడా పవన్ గౌరవప్రదమైన స్థితిలో పొత్తులు లేకపోతే ఒంటరిగా అయినా వెళ్తామని చెప్పడం విశేషం. ఇవన్నీ చూస్తూంటే పవన్ కళ్యాణ్ వత్తిడి రాజకీయం ఏమైనా చేస్తున్నారా అన్న డౌట్లు కూడా కలుగుతున్నాయి. తెలుగుదేశం అయితే పొత్తులకు జనసేనతో సుముఖం. అదే టైం లో అధికారంలో వాటా సీఎం పోస్టు వంటివి అయితే మాత్రం తెలుగుదేశం నుంచి ఆశించలేరు అనే అంటున్నారు.
తెలుగుదేశానికి చంద్రబాబుకూ లోకేష్ ముఖ్యం. ఆయన్ని అధికారంలోకి తీసుకుని రావాలన్నదే బాబు మార్క్ అజెండాగా ఉంటుంది. అదే టైం లో పొత్తులతో వేరొక పార్టీకి సీఎం సీటు ఇవ్వాలని చంద్రబాబు కలలో కూడా భావించరు అని అంటున్నారు. అక్కడే జనసేనతో తెలుగుదేశం పొత్తులకు బ్రేకులు పడుతున్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఒంటరిగా వెళ్ళినా తెలుగుదేశానికి ఈసారి బ్రహ్మరధం పడతారు జనాలు అంటూ ప్రచారం చేస్తున్నాయి.
ఈ నేపధ్యంలోనే పవన్ కూడా ఒంటరి పోరుకు తాము కూడా సై అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. అదే టైం లో బీజేపీని తాము వదులుకోలేదని ఆయన చెప్పడమూ విశేషమే. మొత్తానికి పొత్తుల అంశాన్ని ఆయన ఎన్నికల వేళలో చూసుకుందామని తోసిపుచ్చడం వెనక మాస్టర్ ప్లాన్ ఉందనే అంటున్నారు. ఈ వత్తిడి రాజకీయంతో తెలుగుదేశం జనసేనతో పొత్తులకు కోరుకున్న విధంగా ఒప్పందాలకు సిద్ధపడుతుందా అన్నది చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.