Begin typing your search above and press return to search.
విచిత్రంగా ఉన్న పవన్ వ్యవహారం
By: Tupaki Desk | 2 Dec 2020 5:30 PM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారమే చాలా విచిత్రంగా ఉంటుంది. గతంలో ఎలాగున్నా తాజాగా నివర్ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. ముందుగా కృష్ణ జిల్లాలో పర్యటించి దెబ్బతిన్న పంటలను చూసి రైతులతో మట్లాడిన పవన్ తర్వాత గుంటూరు జిల్లాలో కూడా తిరిగారు. రెండు జిల్లాల పర్యటన తర్వాత ఆయన చేసిన డిమాండే విచిత్రంగా ఉంది.
ఇక్కడ విచిత్రమేమిటంటే దెబ్బతిన్నపంటల గురించి మాట్లాడుతు ఎకరాకు రూ. 35 వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు రూ. తలా 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పంటల వివరాలపై అధికారులు సర్వేలు జరుపుతున్నారని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు. నివేదికలను డిసెంబర్ 31లోగా అందచేయాలని అధికారులను ఆదేశించినట్లు కూడా చెప్పారు. నివేదిక రాగానే పంట నష్టం మొత్తాన్ని డిసెంబర్ 31లోగా అందచేయటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జగన్ అసెంబ్లీలోనే ప్రకటించారు.
ఇక తుపాను కారణంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు తలా రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయటం కూడా విచిత్రమే. ఎందుకంటే నష్టపరిహారాన్ని రూ. 5 లక్షలను ఇప్పటికే జగన్ ప్రకటించేసిన విషయం కూడా పవన్ కు తెలీలేదు. నష్టపోయిన రైతులకు 48 గంటల్లో పరిహారం చెల్లించాలంటూ పవన్ డిమాండ్ చేయటం ఆశ్చర్యంగా ఉంది. నష్టపరిహారం చెల్లించాలంటే ప్రభుత్వానికి నియమ నిబందనలంటు ఉన్నాయన్న విషయం కూడా పవన్ కు తెలిసినట్లు లేదు.
కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే పోరాటం చేస్తానంటు ప్రకటించేశారు పవన్. గతంలో కూడా రాజధాని రైతుల విషయంలో పోరాటాలని, ఆమరణ నిరాహార దీక్షలని చాలానే చెప్పారు. కానీ ఆ తర్వాత అడ్రస్సే కనబడలేదు. మళ్ళీ ఇపుడు కౌలు రైతుల తరపున పోరాటమంటున్నారు. పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడి పవన్ రైతాంగం సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారు. మరి ఎప్పుడు మాట్లాడుతారో ఏమి మాట్లాడుతారో చూడాల్సిందే.