Begin typing your search above and press return to search.
పవన్ ఉత్తరాదిపై తాజా కవరింగ్ మర్మమేంది?
By: Tupaki Desk | 11 May 2017 7:54 AM GMTభావోద్వేగ అంశాలపై రాజకీయం చేయటం అంత తేలికైన విషయం కాదు. పులి స్వారీని తలపించే భావోద్వేగ ఉద్యమ రాజకీయాల్లో ఏ చిన్న తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. అంతేకాదు.. దశల వారీగా తన వాదనను తెర మీదకు తీసుకురావాలే కానీ.. క్రాష్ కోర్సుల మాదిరి భావోద్వేగాల్ని ఉత్త మాటలతో బిల్డ్ చేయటం అంత తేలికైన విషయం కాదు. కేసీఆర్ లాంటి మాటల మరాఠాకే తెలంగాణ ఉద్యమాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకురావాటానికి పుష్కరకాలం పట్టింది.
పరిస్థితులు.. ప్రకృతి సహకరించటంతో ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఒక స్టేజ్‌కి తీసుకెళ్ల గలిగారే కానీ.. లేకుండా అంత సులువుగా అయ్యే పని కాదు. గడిచిన కొద్దికాలంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నార్త్.. సౌత్ అంటూ చేస్తున్నవ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి.
ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు మంచిది కాదన్న మాటను పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు. దీనికి తోడు.. మోడీ లాంటి బలమైన ప్రజాకర్షక నేత ప్రధాని కుర్చీలో కూర్చున్న వేళ.. నార్త్.. సౌత్ అంటూ చెప్పే మాటలు చాలామందికి తలకెక్కటం తర్వాత.. అస్సలు రుచించటం లేదు. దేశ సమగ్రతకు భంగం కలిగేలా పవన్ మాటలు ఉంటున్నాయన్న భావన సగటుజీవిలో వ్యక్తమవుతుండటం గమనార్హం. నార్త్.. సౌత్ అన్న తేడా జనసామ్యానికి పరిచయం తక్కువే. ఎక్కువగా తిరిగే వారికి.. నార్త్ పర్యటించే వారికి.. వారితో మమేకం అయ్యే వారికి మాత్రమే అక్కడి వారి అహంకారం అర్థమవుతుంది. దీనికి తోడు సౌత్ అంటే చెన్నై అన్న మాట ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. మొదట్నించి ఉన్నదే.
ఇక.. ప్రాంతీయ సరిహద్దుల్ని చెరిపేస్తూ.. మోడీ యావత్ భారతాన్ని ప్రభావితం చేస్తున్న వేళ.. ఉత్తర.. దక్షిణ రాష్ట్రాలంటూ పవన్ తెస్తున్న వాదనకు పెద్దగా కనెక్ట్ కావటం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీటీడీ ఈవో పదవిని ఉత్తరాది వారికి ఇవ్వటం ఏమిటన్న ప్రశ్నకు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈవో పదవిలో కేవలం తెలుగువారే ఉండాలనుకోవటం సరికాదని.. సమర్థతతో వ్యవహరించే ఏ అధికారి అయితే ఏమిటన్నది ప్రశ్నగా మారింది. అఖిలభారత సర్వీసులకు చెందిన అధికారులకు ప్రాంతీయ మరకలు అంటించటం సరికాదన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు.
గతంలో పలుమార్లు ఉత్తరాది.. దక్షిణాది వాదనల్ని వినిపించిన పవన్.. తాజాగా మాత్రం టీటీడీ ఈవో విషయంపై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తున్నట్లుగా విడుదల చేసిన ప్రకటన చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. తాను వినిపిస్తున్న వాదనకు ప్రజలు కనెక్ట్ కావటం తర్వాత.. లేనిపోని సందేహాలు వ్యక్తమవుతున్న విషయాన్ని గుర్తించినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే.. దేశ సమగ్రతే జనసేన విదానం అంటూ విడుదల చేసిన జనసేన ప్రకటన చూస్తే.. టీటీడీ ఈవో ఇష్యూలో పవన్ సారు తొందరపడి వ్యాఖ్యలు చేసినట్లుగా పార్టీ భావిస్తోందన్న వాదన వినిపిస్తోంది. తాను చేసిన వ్యాఖ్యలపై జనసామ్యం నుంచి సేకరించిన ఫీడ్ బ్యాక్ నెగిటివ్ గా రావటంతోనే.. తాజా ప్రెస్ రిలీజ్ ద్వారా ఎంతో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పవన్ పడినట్లుగా చెబుతున్నారు. భావోద్వేగ రాజకీయాల్ని స్పృశించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయకుంటే.. భవిష్యత్తులోనూ ఇలాంటి వివరణలు చెప్పుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.