Begin typing your search above and press return to search.

పవన్ బస చూస్తే షాకే..కానీ.. ఈ ప్రచారం ఏంది?

By:  Tupaki Desk   |   12 Oct 2019 8:03 AM GMT
పవన్ బస చూస్తే షాకే..కానీ.. ఈ ప్రచారం ఏంది?
X
సినీ నటులు.. సెలబ్రిటీలు.. రాజకీయ అధినేతలు తర్వాత.. చిన్నసైజు రాజకీయ నేత సైతం తాను వెళ్లే ప్రాంతంలో తన హంగుకు తగ్గట్లుగా ఉండాలని కోరుకోవటం.. లగ్జరీ విషయంలో ఏ మాత్రం రాజీ పడటం అన్నది ఉండదు. అందుకు భిన్నంగా జనసేన అధినేత పవన్ తీరు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖులు ఎలా ఉంటారు? ఎలాంటి చోట్ల ఉంటారన్న ఆసక్తి తరచూ వ్యక్తమవుతుంది.

సాధారణ ప్రజల మాదిరి అత్యంత సామాన్యంగా ఉండే ప్రముఖులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవకే వస్తారు పవన్ కల్యాణ్. పవర్ స్టార్ గా ప్రజల గుండెల్లో నిలిచి.. స్టైలీష్ స్టార్ గా ఆయనకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. రీల్ లైఫ్ లో ట్రెండ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే పవన్.. రియల్ లైఫ్ లో మాత్రం అందుకు భిన్నంగా సాదాసీదాగా ఉండటం కనిపిస్తుంది.

వెన్ను సమస్యతో సతమతమవుతున్న పవన్.. అయుర్వేద వైద్యం కోసం ఉత్తరాదికి వెళ్లటం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హరిద్వార్ లో ఉన్నారు. అక్కడ ఆయన బస చేసిన హోటల్ రూం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. హరిద్వార్ లో ఆయన పవన్ ధామ్ ఆశ్రమంలో బస చేశారు.

ఒక రాజకీయ ప్రముఖుడైనప్పటికీ సాదాసీదాగా జీవితాన్ని ఇష్టపడే వ్యక్తిగా పవన్ కు ఉన్న పేరును మరింత పెంచేలా ఆయన బస చేసిన హోటల్ గది ఉండటం కనిపిస్తుంది. సాదాసీదా గది.. ఏసీ కూడా లేని గదిలో ఆయన ఉన్న వైనం చూస్తే.. నిజ జీవితంలో ఇంత సింఫుల్ గా ఉండటం పవన్ కు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు. గంగా నది ప్రక్షాళన అంశంపై ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పవన్.. తన పర్యటనను చాలా సింఫుల్ లైఫ్ స్టైల్ లో ఉండటం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. అంతా బాగుంది కానీ.. పవన్ బస చేసిన హోటల్ గదిని జనసేనకు చెందిన సోషల్ మీడియా విభాగం తెర మీదకు తెచ్చిన వైనం ఆసక్తికరంగా అనిపించకమానదు. ప్రముఖుడు ఎవరైనా సరే.. తానెంత సింఫుల్ గా ఉంటానన్న విషయాన్ని ప్రచారం చేసుకుంటే ఏం బాగుంటుంది. ఎవరి డబ్బా వారు కొట్టుకోవటం ఒక్కటే ఈ మొత్తం ఎపిసోడ్ లో అభ్యంతరకరమని చెప్పక తప్పదు.