Begin typing your search above and press return to search.
పీకే ప్రసంగం..మస్తు కామెడీ గురూ!
By: Tupaki Desk | 6 Aug 2019 3:12 PM GMTఅన్న మోగాస్టార్ ఇమేజీతో సినిమాల్లో బాగానే క్లిక్ అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్... రాజకీయాల్లో మాత్రం బోల్తా పడిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో ఏపీలో దాదాపుగా అన్ని స్థానాల్లో పోటీ చేసిన పవన్ పార్టీ జనసేన... ఒక్కటంటే ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైపోయింది. అది కూడా సదరు అభ్యర్థి తన సొంత ఇమేజీతోనే విజయం సాదించారు తప్పించి జనసేన ఇమేజీతో గెలిచిన దాఖలా కనిపించలేదు. ఎన్నికల్లో దక్కిన ఘోర పరాభవంతో పది రోజుల పాటు బయటకు వచ్చేందుకే సాహసించని పవన్... ఇప్పుడిప్పుడే కాస్తంత బయటకు వస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలను జనం అప్పుడే మరిచిపోయారనుకున్నారో - ఏమో తెలియదు గానీ... జనానికి తన సత్తా ఏమిటో చూపేందుకు కొత్త కొత్త మాటలను చెబుతున్నారు. పవన్ నోట వస్తున్న ఈ కొత్త మాటలు కామెడీకి ఏమాత్రం తీసిపోవన్న వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతం తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్... తన పార్టీ కార్యకర్తలు - నేతలతో భేటీ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వినడానికి బాగానే ఉన్నా... వాస్తవంలో ఆ మాటలను ఉంచి చూస్తే మాత్రం కామెడీ అయిపోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. అయినా పవన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... ధైర్య లక్ష్మి ఉంటే విజయలక్ష్మి దానికదే వరిస్తుందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుదామని - అసెంబ్లీ మొత్తాన్ని ఆక్రమించేద్దామని కూడా పవన్ చెప్పుకొచ్చారు. గడచిన ఎన్నికల్లో జనసేనకు 6 శాతం ఓటింగ్ దక్కిందని - దీనిని మరింతగా పెంచేద్దామని పిలుపునిచ్చారు. అంతటితో ఆగని ఆయన... తన పార్టీని కూడా ప్రజారాజ్యం మాదిరే విలీనానికి యత్నాలు జరుగుతున్నాయని ఓ బాంబు పేల్చారు. ఇంకాస్త ముందుకెళ్లిన పవన్... పార్టీని తాను మూసేది లేదని - చివరి వరకు పోరాటం చేస్తూనే ఉంటానని కూడా కాస్తంత ఘనంగానే ప్రకటించారు. సింగిల్ కార్యకర్తతోనే తాను పార్టీని నడపగలనని కూడా పవన్ పేర్కొన్నారు.
సరే... ఈ తరహా ప్రసంగం పార్టీ కార్యకర్తల్లో కాస్తంత ఉత్సహాన్ని అయితే నింపొచ్చు గానీ... వాస్తవంలోకి తొంగి చూస్తే... ఈ మాటలు ఎంత కామెడీ అయిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. అయినా 18 అసెంబ్లీలను గెలిచిన ప్రజారాజ్యం ఎక్కడ - సింగిల్ సీటుకే అది కూడా పార్టీ అధినేత రెండు చోట్ల ఓడిన జనసేన ఎక్కడ? నాడు 18 మంది ఎమ్మెల్యేలున్న ప్రజారాజ్యం అవసరం కాంగ్రెస్ కు ఉంది. అదికారంలో ఉన్న కాంగ్రెస్ అవసరం చిరంజీవికి కూడా ఉంది. మరి ఇప్పుడు జనసేనను విలీనం చేసుకోవాలని యత్నించే పార్టీలు ఏవి? అసలు ఇది నమ్మే మాటేనా? అయినా జనసేనను విలీనం చేసుకునేందుకు యత్నిస్తున్న పార్టీలు ఏవి? అలా పార్టీని ఇతర పార్టీల్లో విలీనం చేద్దామంటూ ఒత్తిడి తెస్తున్న జనసేన నేతలు ఎందరు? ఉన్న ఏక్ నిరంజన్ లాంటి సింగిల్ ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయా? సరే... ఇదేదో పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు పవన్ అనుసరిస్తున్న వ్యూహం అనుకున్నా... వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీని కబ్జా చేద్దామన్నంతగా పవన్ చేసిన వ్యాఖ్య మరింత నవ్వు తెప్పించేదేనని చెప్పక తప్పదు.
పార్టీ అధినేత హోదాలో రెండు చోట్ల పోటీ చేసిన పవన్... రెండింటా ఓడిపోయారు. అది కూడా పెద్ద బలమున్న నేతల చేతుల్లో కాదు. అంతకుముందు విజయం కోసం తపించి ఓటములనే దక్కించుకున్న నేతల చేతుల్లో పవన్ ఓడిపోయారు. తానే గెలవలని పవన్.. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో క్లీన్ స్వీప్ సాదిస్తానని చెబితే జనానికి నవ్వు కాక మరేం వస్తుంది? ఇక ధైర్య లక్ష్మీ - విజయలక్ష్మి అన్ని పవన్ మాటలను కూడా చూస్తే... ధైర్యం ఉండి ఏం చేశారో పవన్ పోరాట పటిమనే చెబుతోంది. భీమవరంలో సోమవారం నాటి ప్రసంగంలో పవన్ చేసిన ఓ వ్యాఖ్య నిజంగానే ఆసక్తికరమని చెప్పాలి. తాను గెలిచి ఉంటే భీమవరానికి డంపింగ్ యార్డును సాధించేవాడినని చెప్పిన పవన్... తాను ఓడాను కనుక దానిని సాధించలేనని చెప్పడం చూస్తుంటే... పవన్ పోరాట పటిమ ఏ పాటిదో ఇట్టే తెలిసిపోతుందన్న వాదన వినిపిస్తోంది. గెలిస్తేనే పని చేస్తామన్న కోణంలో పవన్ చేసిన ప్రసంగం జనానికి కామెడీని పంచిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా ఏదో చేద్దామనుకుని, ఏదో మాట్లాడేసి, ఏదో అలా వెళ్లిపోయిన పవన్ నిజంగానే కామోడీ అయిపోయారని చెప్పక తప్పదు.