Begin typing your search above and press return to search.
హార్వర్డ్ లో పవన్ నోట ఉత్తరాది మాట
By: Tupaki Desk | 13 Feb 2017 2:10 PM GMTఉద్యమ నాయకులకు.. రాజకీయ నాయకులకు కాస్త తేడా ఉంటుంది. అదే సమయంలో వీరిద్దరి.. రాజకీయ ఉద్యమ నేతలు మరింత భిన్నంగా ఉంటారు. మొదట చెప్పిన ఇద్దరితో పోలిస్తే.. మూడో వర్గం చాలా ప్రమాదకరమైన వారు. రాజకీయ ఉద్యమ అధినేతల్ని ప్రజలే కాదు.. రాజకీయ పార్టీలు సైతం చాలా తక్కువగా అంచనా వేస్తుంటాయి.కానీ.. వారు తమ భావజాలాన్ని విత్తనాల రూపాల్లో నాటటం మొదలుపెడతారు. వారు విత్తులు నాటినప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. అందుకు ఫలితంగా తర్వాత అనుభవించాల్సిందే. ఆ విషయంలో మరో మాటకు తావు లేదు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు వింటే.. అది నిజమనిపించక మానదు.
గతంలో రాజకీయ ఉద్యమనేతగా వ్యవహరించిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర విభజనపై విత్తనాల్ని తెలంగాణ ప్రజల్లో నాటినప్పుడు అందరూ లైట్ తీసుకున్నారు. కొందరైతే.. నవ్వుకున్నారు. ఎటకారం చేసినోళ్లూ ఉన్నారు. నవ్విన నాప చేను నవ్వక మానదన్న రీతిలో.. కేసీఆర్ ను ఎవరైతే చులకనగా.. చిన్నచూపు చూశారో.. వారంతా తర్వాతి కాలంలో చరిత్రలో కలిసిపోయారన్న విషయాన్ని మర్చిపోకూడదు.
విభజనపై ఉద్యమనేతగా కేసీఆర్ తన గళాన్ని విప్పినప్పుడు.. ఆయన్ను తక్కువగా అంచనా వేసిన వారంతా తర్వాతి కాలంలో చరిత్రలో మర్చిపోయారన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాజాగా జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. గడిచిన కొద్దిరోజులుగా ఒక మాటను పదే పదే చెబుతున్నారు. ప్రస్తావిస్తున్నారు. దక్షిణాదిపై ఉత్తరాది అధిపత్యం సరైనది కాదని.. దక్షిణాది వారిని ఉత్తరాదివారు చిన్నచూపు చూస్తున్నారంటూ తరచూ విమర్శలు.. ఆరోపణలు చేస్తుండటం మర్చిపోకూడదు.
ఉత్తరాది.. దక్షిణాది మాటను పవన్ లేవనెత్తినప్పుడు చాలామంది పెద్దగ పట్టించుకోవటం లేదు. కానీ.. పవన్ మాత్రం ఈ ఇష్యూ మీద తాను ఎంత సీరియస్ గా ఉన్నానన్న విషయాన్ని ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పేస్తున్నారు. అది ఎంతలా అంటే.. ప్రముఖ హార్వర్డ్ వర్సిటీల్లో ప్రసంగించే అవకాశాన్ని పొందిన పవన్.. తన ప్రసంగంలోనూఆయన ఉత్తరాది.. దక్షిణాధి మధ్యనున్న అంతరాన్ని ప్రస్తావించటమే కాదు.. తన వాదనను బలంగా వినిపించి.. ఎన్ఆర్ ఐలు కన్వీన్స్ అయ్యేలా చేయటం గమనార్హం.
పవన్ మాట్లాడుతున్నంత సేపు ఆయన ప్రసంగాన్ని వినటానికి వచ్చిన వారంతా చప్పట్లతో ఆడిటోరియంను దద్దరిల్లేలా చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ హార్వర్డ్ వర్సిటీలో ప్రసంగించిన సందర్భంగా పవన్.. తనదైన ఉత్తరాది.. దక్షిణాది విత్తుల్ని అక్కడి వారి మనసుల్లో దూసుకెళ్లేలా నాటటం కనిపిస్తుంది. హార్వర్డ్ వర్సటీలో ప్రసంగం అంటే చిన్న విషయం కాదని.. తనను ప్రసంగించమని కోరినప్పుడు కాస్త ఆలోచించి అంగీకరించినట్లుగా వెల్లడించారు.
‘ఇండియా ఈజ్ రైజింగ్ గ్లోబల్ పవర్’ అనే అంశం మీద తనను మాట్లాడమని చెప్పారని.. కానీ.. తనకున్న అనుభం మేరకు మొత్తం భారతదేశం గురించి చెప్పలేనుకానీ.. ఏపీ.. తెలంగాణలకు చెందిన వ్యక్తిగా ఆ ప్రాంతాల దృక్కోణం గురించి తన ఆలోచనల్ని పంచుకుంటానని చెప్పటం గమనార్హం. దేశంలోని ప్రజలందరికి ప్రేమ ఉంది. అయితే.. మనమంతా ఒక్కటేనన్న భావన మరింత పెరగాల్సిన అవసరం ఉంది.
‘‘ఉదాహరణకు దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు.. ఉత్తరాది గురించి.. ఉత్తర భారతదేశం వారికి దక్షిణ భారత ప్రాంతానికి చెందిన ప్రజల గురించి పెద్దగా తెలియని స్థితి. వాళ్లు వేరు.. మనం వేరన్న భావనలు ఉన్నాయి. దేశ ప్రజాప్రతినిధులదీ ఇదే తీరు. ముఖ్యంగా రాజకీయ పార్టీల నేతలు ఈ పరిస్థితిపై దృష్టి సారించాల్సి ఉంది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో గాంధీజీ దేశమంతా పర్యటించారు. కానీ.. ప్రస్తుత రాజకీయ నేతల్లో ఎంతమందికి ఇండియామొత్తం తెలుసు? మన నాయకుల్లోమార్పు రావాలి. భిన్నమైన సంప్రదాయాలు ఉన్నప్పటికీ.. జనం అంతా ఒక్కటేనన్న భావనతో వివక్షా రహితంగా వ్యవహరించాల్సి ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
దేశ ప్రజల్లో కల్చరల్ ఇంటెగ్రిటీ పెరగాలన్న ఆశాభావాన్న వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. దేశ ప్రజల్లో ఇలాంటి ఐక్య భావన పెంచితేనే ఇండియా ప్రపంచ శక్తిగా మరింత ముందంజ వేయగలదన్నారు. సమాజాన్ని విభజించిన పాలించే ధోరణితో వ్యవహరిస్తుండటం వల్ల జరుగుతున్న నష్టాల్ని చూసి తట్టుకోలేకపోయారని.. వాటిని ఎదిరించటానికే తానురాజకీయాల్లోకి వచ్చినట్లుగా వెల్లడించారు.
‘‘భారతదేశం అభివృద్ధి చెందుతోంది. కానీ.. వాటి ఫలాలు ఏ కొద్దిమందికో అందుతున్నాయి. ఇంకా కొన్ని సమస్యలు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక ఉదాహరణను ప్రస్తావిస్తా. ఆంధ్ర్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ గడిచిన 20 ఏళ్లలో 20 వేల మందికి పైగా మరణించారు. కానీ.. ఈ విషయం ఎవరికీ తెలీదు.ఎవరూ పట్టించుకోరు. రాజకీయ పక్షాలు.. ప్రజాప్రతినిధులు కూడా ఉదాసీనంగా వ్యవహరించారు. ఈ సమస్య గురించి నాకు తెలిశాక..ఆ ప్రాంతంలో సందర్శించా. బాధితులతో మాట్లాడా. ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వాన్ని కోరా. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి కొన్న చర్యలు ప్రారంభించింది’’ అని వెల్లడించారు.ప్రఖ్యాత వేదిక మీద కూడా తాను తరచూ ప్రస్తావించే ఉత్తరాది.. దక్షిణాది అంశంపై పవన్ మాట్లాడిన తీరుచూస్తే.. రెండుప్రాంతాల మధ్యనున్న దూరాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు జరగాలని.. ఆ విషయంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా..అందుకు భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదన్న విషయాన్ని నేతలు మర్చిపోకూడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/