Begin typing your search above and press return to search.

అలాంట‌ప్పుడు కొట్టేస్తా..వెనుకాడ‌నన్న ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   2 Aug 2018 8:45 AM GMT
అలాంట‌ప్పుడు కొట్టేస్తా..వెనుకాడ‌నన్న ప‌వ‌న్‌
X
ప‌వ‌న్ కాస్త ఓపెన్ గా ఉంటారు. త‌క్కువ సంద‌ర్భాల్లోనే మాట్లాడే ఆయ‌న‌.. మాట్లాడిన‌ప్పుడు మాత్రం ఫుల్ గా మాట్లాడేస్తుంటారు. దీంతో.. ఆయ‌న ఎప్పుడెప్పుడు మాట్లాడుతుంటారా? అన్న‌ట్లు ఆయ‌న అభిమానులు ఎదురుచూస్తుంటారు. మిగిలిన న‌టుల‌కు ప‌వ‌న్ కు తేడా ఏమిటంటే.. త‌న స్నేహితుడితో ఎలా అయితే మాట్లాడ‌తాడో అదే రీతిలో.. అంద‌రి ముందు మాట్లాడ‌తారు.

త‌న‌కెంతో ఆత్మీయుల ద‌గ్గ‌ర ఎంత‌లా ఓపెన్ అవుతారో.. ప‌బ్లిక్ గా అంత‌లా ఓపెన్ కావటం.. త‌న కోపం.. ఆగ్ర‌హం.. ఆవేశం గురించి మాట్లాడ‌టానికి వెనుకాడ‌రు. తాను చేసిన త‌ప్పుల్ని చెప్పేందుకు మొహ‌మాట ప‌డ‌రు. ఇలా..త‌న‌దైన స్టైల్లో ఉండే ప‌వ‌న్ అంటే అందుకే అంత అభిమానం.

ప‌వ‌న్ షూట్ లో ఉన్నాడంటే అక్క‌డ వాతావ‌ర‌ణం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఏదైనా త‌ప్పు చేయ‌టానికి యూనిట్లో వారు భ‌య‌ప‌డుతుంటార‌ని చెబుతారు. యూనిట్లో కానీ.. యూనిట్‌కి సంబంధం లేని వాళ్లు ఎవ‌రైనా పిచ్చ ప‌ని చేస్తే వారిని ఉతికేందుకు సైతం వెనుకాడ‌ని త‌త్త్వం వ‌ప‌న్ కాస్త ఎక్కువే. తేడా చేసినోళ్ల సంగ‌తి చూసేందుకు ఏ మాత్రం మొహ‌మాట ప‌డ‌ని త‌న తీరును తాజాగా బ‌య‌ట‌కు చెప్పేశారు.

అమ్మాయిల్ని ర‌క్షించ‌టానికి తానేం చేసేవాడో చెప్పిన ప‌వ‌న్‌.. ఈ మ‌ధ్య‌న ఒక కాలేజీ స‌మావేశానికి వెళ్లారు. అక్క‌డ మాట్లాడుతూ.. తాను సినిమాలు చేసేట‌ప్ప‌టి రోజుల్లో ప‌లువురిని కొట్టిన వైనంపై వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అమ్మాయిల్ని ర‌క్షించ‌టానికి నిర్బ‌య చ‌ట్టాలు లాంటివి ఉన్నా.. పెద్ద పోలీస్ వ్య‌వ‌స్థ ఉన్నా.. అమ్మాయిల మీద ఆరాచ‌కాలు ఎక్కువ‌గానే జ‌రుగుతున్నాయి. దీనికి కార‌ణం ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ స‌మాధానం చెబుతూ.. తాను న‌టించిన త‌మ్ముడు.. పంజా సినిమా షూటింగ్ స‌మ‌యాల్లో చోటు చేసుకున్న ఉదంతాల్ని గుర్తు తెచ్చుకున్నారు.

తాను పంజా షూటింగ్ కోసం కేర‌ళ‌కు వెళ్లాన‌ని.. త‌న‌తో పాటు బ్యాగ్రౌండ్ లో చాలామంది అమ్మాయిలు న‌టిస్తున్నార‌ని.. వారిని ఒక స‌మూహం వ‌చ్చి అమ్మాయిల్ని ఏడిపిస్తూ ఉంద‌ని.. ఓవైపు పోలీసులు ఉన్నా వారిని ఏమీ అన‌లేద‌న్నారు. అంద‌రూ చూస్తుండ‌గానే అమ్మాయిల్ని భ‌య‌పెట్టేస్తున్న వైనాన్ని స‌హించ‌లేక వారిని తాను కొట్టేసిన‌ట్లు చెప్పారు. అలాంటి చాలా సంద‌ర్భాల్లో జ‌రిగాయ‌న్నారు.

షూటింగ్‌లో ఎందుకు కొడ‌తార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చిన ప‌వ‌న్‌.. షూటింగ్ చేసేట‌ప్పుడు అమ్మాయిల‌కు ఏదైనా ఆప‌ద వ‌స్తే.. పోలీసుల్ని పిలిచే స‌మ‌యం ఉండ‌ద‌ని.. అలాంట‌ప్పుడు ప‌రిస్థితిని కంట్రోల్ చేయ‌టానికి తాను కొడుతుంటాన‌ని చెప్పారు. త‌మ్ముడు షూటింగ్ టైంలో హీరోయిన్ ను ఒక‌డు ఇబ్బంది పెడుతున్నాడ‌ని.. ప‌క్క‌కు వెళ్లు అని చెబితే విన‌లేద‌ని.. లాగి ఒక్క‌టి ఇచ్చాన‌ని.. దాంతో అంద‌రూ అత‌డ్ని చెట్టుకు క‌ట్టేసి కొట్టార‌న్నారు.

ఎన్ని చ‌ట్టాలు ఉన్నా.. ఎంతమంది పోలీసులు ఉన్నా.. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం లేకున్నా.. త‌ప్పును ఖండించే త‌త్త్వం లేకుంటే ఇలాంటి ప‌రిస్థితే ఉంటుంద‌న్నారు. తాను ఆ రోజు అలా కొట్టి ఉండ‌క‌పోతే.. త‌న సినిమా షూటింగ్‌కు వ‌చ్చే అమ్మాయిలుఎంత అభ‌ద్ర‌తా భావానికి గురి అవుతుంటారు? అని ప్ర‌శ్నించారు.

రీల్ లైఫ్ లో తాను 20 మందిని కొట్టేసి.. రియ‌ల్ లైఫ్ లో ఒక్క‌డిని ప‌క్క‌కు వెళ్లు అని కూడా అన‌క‌పోతే ఈ ద‌రిద్ర‌పు హీరోగిరి ఎందుక‌ని అనుకుంటాన‌న్నారు. త‌ప్పును అడ్డుకోలేన‌ప్పుడు ఈ జీవితం ఎందుకనిపిస్తుంద‌న్నారు. ఎవ‌రైనా ఒక‌రు ఆడ‌పిల్ల‌ను ఏడిపిస్తుంటే .. దానికి త‌ప్పు స‌మాజానిది కూడాన‌ని.. అంతేకానీ పోలీసుల‌దే త‌ప్పు అనుకోవ‌టం స‌రికాద‌న్నారు. త‌న అక్క‌.. చెల్లిని కూడా చాలా సంద‌ర్భాల్లో ఏడిపించే వార‌ని.. ఇంత‌మంది చూస్తుంటే ఒక‌డు అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే ఎవ‌రూ మాట్లాడ‌రేం అనుకునేవాడిన‌ని ప‌వ‌న్ గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక‌.. ప‌వ‌న్ మాట‌ల‌కు.. కాలేజీ స్టూడెంట్స్ ఎంత‌లా ఫిదా అయ్యారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.