Begin typing your search above and press return to search.

పీకే ఫ్యాన్స్ ఫిదా అయ్యే ఫోటో బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   13 Dec 2019 4:46 AM GMT
పీకే ఫ్యాన్స్ ఫిదా అయ్యే ఫోటో బయటకొచ్చింది
X
ఎవరెన్ని అనుకున్నా.. ఎంతలా కామెడీ చేసినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కున్న ఇమేజ్ కాస్త భిన్నమైనది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ లాంటోళ్లు పవన్ పై వ్యంగ్య వ్యాఖ్యలు చేసినా.. తన తాజా సినిమాలో పవన్ ను కామెడీ పీస్ గా చూపించినా.. రీల్ కు రియల్ కు మధ్య పొంతనే లేదని చెప్పాలి. తనదైన మేనరిజమ్ తో తెలుగు ప్రజల్లో తనకో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న పవన్ రియల్ లైఫ్ లో చాలా సింఫుల్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.

అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సామాన్యుడిగా వ్యవహరించటంలో ఆయనకు సాటి వచ్చే సెలబ్రిటీలు మరెవరూ ఉండరని చెప్పక తప్పదు. ఎక్కడా తన అటిట్యూడ్ చూపించేందుకు ఇష్టపడరు. నేల మీద కూర్చొని తినటం.. మట్టిపాత్రల్లో భోజనం చేయటం లాంటివి ఇప్పటికే చేసి.. తన సింప్లిసిటీతో తనను అభిమానించే వారి మనసుల్ని దోచేసిన పవన్ కల్యాణ్.. తాజాగా మరోసారి తనదైన తీరును ప్రదర్శించి మైలేజీ కొట్టేశారు.

కాకినాడలో తాను నిర్వహించిన రైతు సౌభాగ్య దీక్షను పూర్తి చేసుకొన్న పవన్ రాజమండ్రిలోని మధురపూడి ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. అయితే.. విమానం ఆలస్యమవుతుందన్న సమాచారాన్ని అందుకున్న ఆయన.. దారి మధ్యలో ఒక జనసేన కార్యకర్త ఇంటి వద్ద సేద తీరారు. ఇంటి వరండాలోని అరుగుపై పడుకొని విశ్రాంతి తీసుకున్నారు.

తల కింద రెండు చిన్న తలగడలు తప్పించి.. ఎలాంటి చాప.. పరుపు లేకుండానే విశ్రాంతి తీసుకుననారు. దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. వీటిని చూస్తున్న పవన్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇంత సింఫుల్ గా ఉండటం పవన్ కు మాత్రమే సాధ్యమంటూ తమ అభిమాన నాయకుడ్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.