Begin typing your search above and press return to search.
మూడు రాజధానుల మీద పవన్ ఎటకారం మామూలుగా లేదుగా?
By: Tupaki Desk | 18 Dec 2019 2:15 AM GMTఏపీ రాజధానిపై స్పష్టత ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్న విషయాన్ని చెబుతూ.. కర్నూలు.. విశాఖలోనూ రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లుగా చెప్పారు. హాట్ టాపిక్ గా మారిన జగన్ మాటపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచనను తప్పు పట్టారు.
తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచచి పరమాన్నం అడిగినట్లుగా ఉందంటూ సామెతను చెప్పి మరీ ట్వీట్ పంచ్ సంధించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రకటన తర్వాత పవన్ సోషల్ మీడియాలో స్పందించారు. తన అభిప్రాయాన్ని షేర్ చేశారు.
సౌతాఫ్రికా మాదిరి ఏపీలో మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయాలన్న జగన్ ఆలోచనను పవన్ తప్పు పట్టారు. కమిటీ రిపోర్టు రావటానికి మునుపే.. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించటం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ మాత్రం దానికి కమిటీ వేయాల్సిన అవసరం ఏమిటి? అని నిలదీసిన ఆయన.. నిపుణుల్ని అపహాస్యం చేయటం దేనికి? అంటూ ప్రశ్నను సంధించారు. ఇక.. మూడు రాజధానులపై పవన్ మరో ట్వీట్ లో స్పందించారు.
తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. ఒక్క అమరావతి రాజధానికే దిక్కుదివాణం లేదు ఇప్పటిదాకా.. మరి జగన్ రెడ్డి మూడు అమరావతి నగరాలు అసలు సాధ్యమేనా? పాలకులతో రాష్ట్ర విభజన మొదలుకొని ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనిశ్చితి.. అశాంతి.. అభద్రత తప్ప ఇంకేమీ ఒరగలేదన్నారు.