Begin typing your search above and press return to search.

అవి పాచినోళ్ళు...పవన్ సింగిల్ డైలాగ్

By:  Tupaki Desk   |   9 Jan 2023 12:30 AM GMT
అవి పాచినోళ్ళు...పవన్ సింగిల్ డైలాగ్
X
ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేనగా పాలిటిక్స్ సాగుతోంది. పవన్ కళ్యాణ్ణి పట్టుకుని వైసీపీ నేతలు విమర్శిస్తూంటారు. ఆయన ఒక మీటింగ్ పెడితే పది మంది మంత్రులు దాన్ని కౌంటర్ చేస్తారు. ఇలా ఏపీలో కొంతకాలంగా సాగుతోంది. ఈ నేపధ్యంలో వైసీపీ మంత్రులు రోజా సహా అంబటి రాంబాబులతో పాటు అనేక మందికి ఒకే ఒక్క సింగిల్ డైలాగ్ తో పవన్ కళ్యాణ్ గట్టి డోస్ ఇచ్చేశారు.

అవి పాచినోళ్ళు అంటూ ఆయన అన్న మాట చాలా గట్టిగానే గుచ్చుకునేలా ఉంది. ఆ నోళ్ళకు పాలసీల గురించి మాట్లాడడం తెలియదు. కేవలం మా మీద విమర్శలు చేయడం తప్ప అని పవన్ అన్నారు. మేము ఏమి మాట్లాడినా విమర్శలకు తెగబడిపోతున్న మంత్రులకు వారి శాఖల మీద అవగాహన లేదు అని ఆయన అన్నారు.

ఇక నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు తన శాఖ మీద అవగాహన లేనే లేదని అన్నారు. ఇలా తమ మీద కామెంట్స్ చేసే వారి అందరికీ కలిపి ఈ నెల 12న జరిగే యువశక్తి మీటింగులో సమాధానం చెబుతామని పవన్ స్పష్టం చేశారు. తాను ఏమి మాట్లాడినా వారికి ఇష్టం లేకపోవడమేంటి అని అన్నారు.

తన పార్టీ ప్రచారం కోసం వాహనాలు కొనుగోలు చేసుకున్నా వారు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. తన వాహనాల మీద కామెంట్స్ చేశారు. రిజిస్ట్రేషన్ మీద కామెంట్స్ చేశారు అని ఆయన ఫైర్ అయ్యారు. తాను కష్టపడి బ్యాంక్ రుణాల ద్వారా వాటిని కొనుగోలు చేశాను అని చెప్పారు. రాజకీయ పార్టీలకు వాహనాలు ఉండడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.

ఏపీలో అధికార వైసీపీది ఒక్కటే అజెండాగా ఉందని తమ మీద ఎవరూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయకూడదు, తమ గురించి ఎవరూ గట్టిగా మాట్లాడకూడాదు అన్న పాలసీని పెట్టుకున్నారని ఆయన అన్నారు. తాను అడుగు తీసి అడుగు వేస్తేనే వారికి ఇబ్బందిగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఏపీలో అరాచకత్వం పాలనగా సాగుతోందని దాన్ని అడ్డుకోవడం ఎలా అన్న దాని మీదనే తాను తెలుగుదేశం అధినేత చంద్రబాబుని కలిశాను అని ఆయన చెప్పారు. తామంతా ఒకే గళంతో ప్రభుత్వ విధానాల మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని ఆయన అన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పాచినోళ్ళు అంటూ మంత్రుల మీద వైసీపీ నేతల మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరి దీనికి వైసీపీ నుంచి గట్టి రిటార్ట్ ఉంటుందా అంటే చూడాలి. పవన్ ఏది మాట్లాడినా కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు రెడీగా ఉంటారు కాబట్టి ఆ వైపు నుంచి ఏమి మాటల తూటాలు పేలతాయో వెయిట్ చేయాల్సిందే..