Begin typing your search above and press return to search.
సిగ్గు లజ్జ లేదా.. ఉప్పు.. కారం తినరా?
By: Tupaki Desk | 4 Nov 2018 5:54 AMఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అంతేనా.. ఒకప్పుడు బాబుతో భుజం.. భుజం రాసుకున్న పవన్ తాజాగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ తో భేటీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతాన్ని తనదైన శైలిలో తవ్వి తీసిన పవన్.. బాబుపై భారీగా మండిపడ్డారు.
ఏపీలో సైకిల్ కు పంక్చర్ ఏర్పడిందని.. పార్టీ నిర్వీర్యమైందంటూ ఫైర్ అయిన పవన్.. బాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ తో టీడీపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించిన పవన్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని మర్చిపోయి.. స్నేహహస్తం చాటుతారా? అంటూ విరుచుకుపడిన పవన్.. మీకు సిగ్గు లేదా? ఆత్మగౌరవం ఉండదా? సిగ్గు.. లజ్జ అన్న పదాలకు అర్థం తెలీదా అంటూ వరుస పెట్టి తిట్టిపోస్తున్నారు. బాబుపై పవన్ చేసిన షాకింగ్ వ్యాఖ్యల్ని చేశారు. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో నిర్వహించిన సభలో ఆయన ఆవేశపూరిత ప్రసంగం చేశారు. అదెంత ఇంట్రస్టింగ్ గా ఉందన్నది ఆయన మాటల్లో చదివితేనే ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఆయనేమన్నారంటే.
+ రాష్ట్రంలో సైకిల్ కు పంక్చర్ పడింది. నిర్వీర్యమైపోయింది. ఉమ్మడి ప్రణాళికతో జనసైనికుల బలంతో కేంద్రం మెడలు వంచుదాం. ఇదే కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆపార్టీ నాయకులే దూరంగా ఉంటే.. అలాంటి కాంగ్రెస్ తో ఈ రోజు సీఎం జతకడతారు.
+ టీడీపీ నాయకులకు పౌరుషం రాదా? కొనకళ్ల నారాయణ గారిని లాగి కొట్టారే..! ఎంపీ శివప్రసాద్ కొరడాతో రక్తాలు చిందేలా కొట్టుకున్నారే! విభజన సమయంలో చీకట్లో పడేసి కొట్టారు కదా. అయినా మీకు సిగ్గు రాదా. ఆత్మగౌరవం లేదా. సిగ్గు - లజ్జ అనే పదాలకు మీకు అర్థం తెలుసా? ఉప్పు, కారం తినరా! తెలుగువాడంటే ఆత్మగౌరవంతో నిండి ఉన్నవాడు. పంచెకట్టుతో ఉన్నవాడు. మీ పౌరుషం ఏమైంది?
+ ఆనాడు సీఎం అంజయ్యను, మన ఆత్మగౌరవాన్ని దెబ్బతినేలా ఛీ కొడుతుంటే నాదెండ్ల భాస్కరరావు, ఎన్టీ రామారావు కలిసి పెట్టిన పార్టీ కదా! అలాంటి టీడీపీని ఇవాళ రాహుల్ గాంధీ కాళ్ల దగ్గర పెట్టి.. బాంచన్ మీ కాళ్లు మొక్కుతా అంటే సిగ్గు పడాలి. మీ పక్కన తిరగడానికి కాంగ్రెస్ నాయకులే సిగ్గుపడుతున్నారు. మీకు సిగ్గు లేదా? యనమల రామకృష్ణుడుగారు మీకు పౌరుషం లేదా?
+ యనమల తెలివిగా.. విజ్ఞతతో మాట్లాడతారు. ఉత్తరాది నాయకులు ఛీ కొడుతుంటే జాతీయపార్టీల కాళ్లు పట్టుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సొంత అన్నయ్యని విభేదించి నేను ప్రజలకోసం నిలబడినోడ్ని. అలాంటిది మోడీకి భయపడతానా? ప్రత్యేక హోదా కోసం ఉమ్మడిగా పోరాటం చేద్దాం. కేంద్రం మెడలు వంచుదాం. మాతో కలిసి రండి.
+ నిజంగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలంటే.. సీఎం పిలిస్తే నేను నిలబడనా? సహకారం కావాలంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంతో పోరాటం పెట్టుకోవాలంటే మా ఆఫీసుకు రండి! మా సహకారం అడగండి! మీ పక్కన నిలబడకపోతే అడగండి. అందుకే ఆఫీసుకు రమ్మన్నాం. పొత్తుల గురించి కాదు. టీడీపీని ప్రత్తిపాడు నుంచి సవాల్ చేస్తున్నా.. ముఖ్యమంత్రిగారిని అడుగుతున్నా.. హోదాపై జనసేన, సీపీఐ, సీపీఎం, మిగతా పార్టీలను పిలవండి. మాకు సందేహాలున్నాయి. మీ నుంచి నివృత్తి చేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలున్నాయి.
+ బీజేపీని వెనకేసుకురావడానికి నేను మీలాగ అవకాశవాదిని కాదు. నేను దొంగ దెబ్బలు తీయను. వెన్నుపోట్లు పొడవను. విభేదిస్తే అందరికీ తెలియజేస్తాను.అందరికీ ఆమోదయోగ్యమైన మార్గంలో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిద్దాం. ప్రత్యక్ష ప్రసారం చేద్దాం. మోదీతో గొడవ పెట్టుకోవాలంటే మీకు నైతికత లేదు. జనసేన ఆ నైతిక బలం ఇస్తుంది.
+ బాబు వారి కుటుంబసభ్యులు, మంత్రులు కోట్లాది రూపాయలు పోగేసుకుంటారు. రూ.25 కోట్ల చొప్పున జగన్ పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సీఎం చంద్రబాబు కుమారుడు పంచాయతీ వార్డు మెంబరుగా కూడా పోటీ చేయకుండానే పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యారు.
+ 2003లో రాజకీయాల్లోకి వస్తానంటే అమ్మ వద్దంది. నిన్ను చంపేస్తార్రా అని భయపడింది. 2018లో ఆమే నువ్వు వెళ్లాలి అని దీవించింది. మొన్నే మా నాన్న పెన్షన్ రూ.4లక్షలు ఇచ్చింది. చిరంజీవి - నాగబాబే కాదు.. ఆంధ్రా అంతా అన్నదమ్ములే. ఇద్దరు అక్కచెల్లెళ్లే కాదు అంతా ఆడపడచులే. జగమంత కుటుంబమని అమ్మ చెప్పింది. 2019లో కచ్చితంగా సీఎం అవుతా. డబ్బున్న వాళ్లూ జనసేనలోకి రావాలి. సంపాదించుకోడానికి కాదు. రాజకీయాల్లో దోపిడీని ఆపడానికి రావాలి. రాష్ట్రాన్ని టీడీపీ రాహువులా పట్టుకుని కూర్చుంది. ఆ పార్టీ వెళ్లిపోయే రోజులు దగ్గరపడ్డాయి.