Begin typing your search above and press return to search.

ఏకాకి బాబు దగ్గర ఆ ఫొటో కూడా తీసేస్తే ఎలా?

By:  Tupaki Desk   |   29 May 2018 6:51 PM GMT
ఏకాకి బాబు దగ్గర ఆ ఫొటో కూడా తీసేస్తే ఎలా?
X
టైం బాగు లేకుంటే తాడే పామై కరుస్తుందంట. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి అలానే ఉంది. గత ఎన్నికల్లో కాపు ఓట్లకు తానేసిన గాలానికి తాడులా పనికొచ్చిన పవన్ ఇప్పుడు పాములా బుసలు కొడుతున్నాడు. దీంతో అటు బీజేపీ అండ లేక.. ఇటు పవన్ అండ లేక 2019 ఎన్నికల్లో ఎలారా భగవంతుడా అని తెగ టెన్షన్ పడుతున్న బాబుకు పవన్ భారీ సవాల్ విసిరాడు. దమ్ముంటే ఎన్టీఆర్ ఫొటో లేకుండా గెలవగలరా అంటూ సవాల్ విసిరారు. అయితే.. ఆ సవాల్ స్వీకరించడానికి టీడీపీ నుంచి ఎవరూ ముందచుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఎవరూ లేక ఏకాకి అయిన టీడీపీకి ఆ మహానుభావుడి ఫొటో కూడా లేకపోతే ఎలా అన్నదే వారి సందిగ్థం.

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ తెలుగుదేశం పార్టీపై భారీ స్థాయిలో విరుచుకుపడ్డారు. కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టులన్నిటినీ శ్రీకాకుళానికి తీసుకొస్తున్నారని.. అభివృద్ధి మాటున ఇక్కడ ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ జనం తనను కోరుతున్నారని.. అన్ని పనులూ చేశామని టీడీపీ చెబుతుంటే ఈ సమస్యలు ఎందుకిలా ఉణ్నాయో తనకేమీ అర్థం కావడం లేదన్నారు.

పవన్ ప్రభావం ఒక్క శాతం కూడా లేదంటున్నారని.. మరి, అప్పుడు తన మద్దతు ఎందుకు కోరారని ఆయన ప్రశ్నించారు. తానెవరో తెలియదని అశోక్ గజపతిరాజు అంటున్నారని.. రాజులకు తనలాంటి సామాన్యులు ఎందుకుతెలుస్తారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనలా సొంత పార్టీ పెట్ట లేదని.. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఆయన కబ్జా చేశారని అన్నారు. దమ్ముంటే ఎన్టీఆర్ ఫొటో లేకుండా గెలవాలని సవాల్ విసిరారు.