Begin typing your search above and press return to search.
జగన్ పౌరుషాన్ని పవన్ ఎందుకు ప్రశ్నిస్తున్నారు?
By: Tupaki Desk | 2 April 2019 5:15 AM GMTప్రత్యర్థులపై దునుమాడటం మామూలే. తన ప్రత్యర్థులు ఇద్దరైనప్పుడు వారిద్దరిని చెరి సమానంగా కడిగేయటం ఎక్కడైనా చూస్తాం. కానీ.. ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ముఖాముఖిన తలపడుతున్న వేళలో.. జనసేన ఎంట్రీ ఇవ్వటం.. పోటీలో తానూ ఉన్నట్లుగా చెప్పుకుంటోంది. పవన్ ఎంతలా ఫైర్ అవుతున్నా.. ఆయన పార్టీని పోటీలో ఉన్నట్లుగా పరిగణిస్తున్న నియోజకవర్గాలు చాలా తక్కువగా చెప్పాలి.
తన ఎంట్రీతోనే సంచలనం సృష్టిస్తాననే నమ్మకం ఉన్న పవన్.. ఏపీ ఎన్నికల ఫలితాల మీద చాలానే ఆశలు పెట్టుకున్నారు. తనను చూసేందుకు.. తన మాటల్ని వినేందుకు వచ్చిన జనాలు..సీఎం.. సీఎం అంటూ రిథమిక్ గా నినాదాలు చేసిన నేపథ్యంలో.. ఏపీ సీఎం కుర్చీ మీద పవన్ సైతం మనసు పారేసుకున్నారు.
అప్పటివరకూ పదవుల మీద తనకు పెద్ద ఆశలు లేవనే పవన్.. ఇప్పుడు సీన్ మార్చేసి.. ప్రజలు తనకుఅధికారాన్ని ఇస్తే.. తానేమిటో చేతల్లో చేసి చూపిస్తానని చెబుతుననారు. అధికారం చేతిలోకి రావాలంటే ముందుగా ప్రజలు ఆమోదం తప్పనిసరి కావటంతో.. ఆయనిప్పుడు కొత్త ప్లాన్ ను తెర మీదకు తెచ్చినట్లుగా చెబుతున్నారు. మొన్నటి వరకూ ఆచితూచి అన్నట్లు మాట్లాడతానని చెప్పే పవన్.. ఇప్పుడు అలాంటి మెహమాటల్ని పక్కన పెట్టేశారు. తాను గొంతు సవరించుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుంటే నష్టం భారీగా ఉంటుందన్న విషయంతో పాటు.. ఎంత ఎక్కువగా అయితే అంత ఎక్కువగా సెంటిమెంట్ ను రగల్చాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించినట్లు చెప్పాలి.
ఎక్కడైనా అధికార పార్టీ మీద విమర్శలు చేస్తుంటారు. కానీ.. పవన్ మాత్రం సిత్రంగా జగన్ పార్టీని టార్గెట్ చేయటం కనిపిస్తుంది.
ఎందుకిలా అంటే దానికో ఆసక్తికర ప్లాన్ ఉందని చెబుతున్నారు. ఏపీలో బాబు వ్యతిరేక ఓటు భారీగా ఉండటం.. అవన్నీ జగన్ ఖాతాలోకి పడటం మినహా మరో దారి లేదు. ఈ నేపథ్యంలో ఆ ఓట్లను కొల్లగొట్టాలంటే జగన్ మీద ఫోకస్ పెంచితే సరిపోతుందన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
కాపు ఓట్లతో పాటు బలహీన వర్గాల ఓట్ల మీద దృష్టి పెట్టిన పవన్.. యువత ఓట్లు తనకు పడతాయన్న నమ్మకంతో ఉన్నారు. బాబు.. జగన్ వ్యతిరేక ఓటు మత్రమే పవన్ కు పడే వీలుంది. అదే సమయంలో బాబు వ్యతిరేక ఓటు దాదాపుగా జగన్ కు పడటం ఖాయం. వారి మొదటి ప్రాధాన్యత జగనే అవుతారు. ఈ నేపథ్యంలో జగన్ ను టార్గెట్ చేస్తే భారీ ఎత్తున ఓట్లను దండుకోవటానికి అవకాశం ఉంటుందన్నది పవన్ ప్లాన్ గా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పై తీవ్రస్థాయిలో పవన్ దునుమాడుతున్నారు. అంతేకాదు.. జగన్ లో పౌరుషం లేదా? అన్న ప్రశ్నతో పాటు.. ఆంధ్రులకు ఏ మాత్రం నచ్చని కేసీఆర్ పేరును జగన్ తో లింకు పెడుతూ భారీ ప్రయోజనాన్ని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. పవన్ వ్యూహానికి ఊతమిచ్చేలా ఆంధ్రా ఓట్లర్లు వ్యవహరిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఎన్నికల ఫలితాలు వెల్లడైతే కానీ దొరకని పరిస్థితి.