Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ 'సీక్రెట్' మీటింగ్..ఎంట్రీ ఫీజు 10ల‌క్ష‌లు?

By:  Tupaki Desk   |   11 Sep 2018 11:07 AM GMT
ప‌వ‌న్ సీక్రెట్ మీటింగ్..ఎంట్రీ ఫీజు 10ల‌క్ష‌లు?
X
స‌మాజంలో మార్పు కోసం తాను జ‌న‌సేన పార్టీని స్థాపిస్తున్నాన‌ని 2014లో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత టీడీపీ,బీజేపీల‌తో అంట‌కాగిన ప‌వ‌న్....వారికి మ‌ద్ద‌తుగా కాలికి బ‌ల‌పం క‌ట్టుకొని ప్ర‌చారం చేశారు. అయితే, నాలుగేళ్ల పాటు వారి అవినీతిపాల‌న‌ను చూస్తూ కూడా ప్ర‌శ్నించ‌కుండా ఉండిపోయిన ప‌వ‌న్....ఆ త‌ర్వాత జ‌న‌సేన‌ 2019ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌బోతోంద‌ని ప్ర‌క‌టించారు. అయితే, తాను సొంత డ‌బ్బుల‌తోనే పార్టీని న‌డిపిస్తున్నాన‌ని, త‌న‌కు ఫండ్స్ ఏమీ రావ‌డం లేద‌ని ప‌వ‌న్ ప‌లుమార్లు నొక్కి వ‌క్కాణించారు. అయితే, కొద్ది రోజుల క్రితం అమ‌రావ‌తి స‌మీపంలో ప‌వ‌న్ కొన్న ఖ‌రీదైన స్థ‌లం....ఇటీవ‌ల‌..ఓ మీడియా చానెల్ ను కొన్న‌ట్లు వార్తలు వ‌చ్చిన నేప‌థ్యంలో ...ప‌వ‌న్ రాజ‌కీయ ఆర్థిక మూలాల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా, ప‌వ‌న్ నిర్వ‌హించిన ఓ ర‌హ‌స్య స‌మావేశంపై ఓ తెలుగు న్యూస్ చానెల్ నిర్వ‌హించిన స్టింగ్ ఆప‌రేష‌న్ పెను దుమారం రేపుతోంది. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన బడాబాబుల‌తో ప‌వ‌న్ హైద‌రాబాద్ లో ఓ సీక్రెట్ మీటింగ్ నిర్వ‌హించార‌ని....ఆ మీటింగ్ కు హాజ‌ర‌య్యేందుకు 10ల‌క్ష‌ల రూపాయ‌లు ఎంట్రీ ఫీజ‌ని ఆ చానెల్ బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ఆ చానెల్ క‌థ‌నం ప్ర‌కారం....ఆ మీటింగ్ కు సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

పార్టీని ఆర్థికంగా బ‌లోపేతం చేసేందుకు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన కొంత‌మంది కీల‌క‌మైన వ్య‌క్తులు, వ్యాపార‌వేత్త‌లు, ప్ర‌ముఖులతో ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ లోని ఐటీసీ కాక‌తీయ హోట‌ల్ లో స‌మావేశ‌మయ్యార‌ని తెలుస్తోంది. నిన్న సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ప‌వ‌న్ ఆ స‌మావేశానికి హాజ‌రై గంట‌న్న‌ర‌పాటు అక్క‌డి అతిథుల‌తో వ్య‌క్తిగ‌తంగా మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌త్యేక ఇన్విటేష‌న్ లు, పాసులు ఉన్న వారిని మాత్ర‌మే ఆ స‌మావేశం జ‌రుగుతున్న గ‌దిలోకి అనుమతించార‌ని, లేని వారిని బ‌య‌ట‌కు పంపిస్తామ‌ని నోటీసులు కూడా అతికించార‌ని ఆ క‌థ‌నంలో ప్ర‌సారం చేశారు. మీటింగ్ హాల్ లోకి అతిథుల‌ ఫోన్ ల‌ను కూడా అనుమ‌తించ‌లేద‌ట‌. దాదాపు గంట‌న్న‌రపాటు ప్ర‌సంగించిన ప‌వ‌న్....పార్టీ కోసం ఎలా క‌ష్ట‌ప‌డాలి....ఏం చేయాలి అని దిశా నిర్దేశం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ అతిథులంద‌రికీ కొన్ని సూచ‌న‌లు.. ఆర్థికంగా...ఇత‌ర‌త్రా విధాలుగా ఎలా సాయ‌ప‌డాలి అని ప‌వ‌న్ చెప్పారట‌. అంతేకాదు, 10ల‌క్ష‌లు క‌డితేనే ఆ స‌మావేశానికి ఎంట్రీ....అని టాక్ వ‌స్తోంది. ఈ స‌మావేశానికి హాజ‌రైన బ‌డాబాబలు ఎంత ఫండ్ ఇవ్వ‌ద‌లుచుకున్నారో ప‌వ‌న్ అడిగి తెలుసుకున్నార‌ట‌. 150కు పైగా ప్ర‌త్యేక అతిథులు హాజ‌రైన ఈ స‌మావేశంలో ....ప‌రిమిత సంఖ్య‌లో మిగ‌తా సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌ ప‌వ‌న్ అభిమానులైన బిగ్ షాట్స్, వ్యాపార వేత్త‌లు ఉన్నార‌ని తెలుస్తోంది. పార్టీ ఫండ్ కోస‌మే ప‌వ‌న్ ...ఈ ప్రోగ్రాం నిర్వ‌హించార‌ని టాక్. అస‌లు పార్టీ ఫండ్ వ‌సూలు చేయ‌డంలేద‌ని...కుల‌మ‌తర‌హిత రాజ‌కీయాలు చేస్తాన‌ని చెప్పే ప‌వ‌న్...ఈ త‌ర‌హా స‌మావేశాలు నిర్వ‌హించి ఎటువంటి సందేశం ఇవ్వ‌ద‌లుచుకున్నార‌ని సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.