Begin typing your search above and press return to search.

జగన్ ని ముఖ్యమంత్రి కాదంటివే .. నేడు ఈ విజ్నప్తి ఏంటి పవనా ?

By:  Tupaki Desk   |   19 Dec 2019 5:53 AM GMT
జగన్ ని ముఖ్యమంత్రి కాదంటివే .. నేడు ఈ విజ్నప్తి ఏంటి పవనా ?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు వదిలి , ప్రజలకి ఎదో చేయాలనీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..ఇప్పుడు అసలు ఏంచేస్తున్నాడో ఆయనకే అర్థం కావడంలేదు. ఎన్నికల ముందు వరకు నేనే కాబోయే సీఎం అన్నారు ..కనీసం ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీచేస్తే ఒక్కచోట కూడా గెలవలేకపోయాడు. ఇక ఆ తరువాత కొద్దీ రోజులు సైలెంట్ అయిన పవన్ .. మళ్లీ ఈ మధ్య రాజకీయంగా ఫుల్ బిజీగా మారిపోయాడు.

అలాగే , వైసీపీ ప్రభుత్వం పై బురద జల్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల ముందు సీఎంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని గుర్తించను. అందుకే ఆయ‌న్ను జ‌గ‌న్‌రెడ్డి అనే పిలుస్తాను. జ‌గ‌న్‌రెడ్డి త‌న ప‌ద్ధ‌తులు మార్చుకునేంత వ‌ర‌కు సీఎంగా గుర్తించే ప్ర‌శ్నే లేదు’ అని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనేక సంద‌ర్భాల్లో చెప్పారు. సీఎంగా ప‌వ‌న్ గుర్తించ‌రు కానీ, అలా చేయండి, ఇలా చేయండి, లేక‌పోతే తాట తీస్తాన‌ని హెచ్చ‌రిస్తుంటాడు.

ఏపీలో మూడు రాజ‌ధాని కేంద్రాలు ఉండొచ్చేమోన‌ని అసెంబ్లీలో సీఎం జ‌గ‌న్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై వ‌రుస ట్వీట్ల‌తో ప‌వ‌న్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాజ‌ధానిపై నిపుణుల క‌మిటీ నివేదిక వ‌చ్చే వ‌ర‌కు ఆగాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశాడు. అస‌లు సీఎంగానే గుర్తించ‌కుండా ఏ హోదాలో జ‌గ‌న్ స‌ర్కార్‌కు విజ్ఞప్తి చేస్తున్నారో అని అర్థం కావ‌డం లేదు. జగన్‌ రెడ్డి గారు అసెంబ్లీ లో ప్రకటన ఒక వ్యూహం ప్రకారమే చేశారు. ఉత్తరాంధ్ర భూములు చాలావరకూ వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని స్థానికులు చెప్పారు. విశాఖ ప్రాంతంలో భూములపై కఠినంగా ఉన్న జేసీ శివశంకర్‌ లోతేటిని ఆఘమేఘాలపై తప్పించారు. ఇక అక్కడ పులివెందుల పంచాయితీలు మొదలవుతాయి అని పవన్‌ ట్వీట్‌ చేశారు. ఏ పార్టీకైనా, ప్ర‌భుత్వానికైనా వ్యూహాలు లేకుండా ముందుకు ఎలా పోతారు? పార్టీలు, ప్ర‌భుత్వాలే కాదు...వ్య‌క్తులైనా ఓ ప్ర‌ణాళిక‌, ఆలోచ‌న లేకుండా ఏ ప‌నీ చేయ‌రు క‌దా. మ‌రి జ‌గ‌న్‌రెడ్డి గారు అసెంబ్లీలో ఒక వ్యూహం ప్ర‌కార‌మే ప్ర‌క‌ట‌న చేశార‌ని ట్వీట్ చేయ‌డం రాజ‌కీయ అజ్ఞానానికి నిద‌ర్శ‌నంగా చెప్పవచ్చు.