Begin typing your search above and press return to search.

రవిప్రకాష్ పై పవన్ సెటైర్లు.. మళ్లీ రిపీట్

By:  Tupaki Desk   |   10 May 2019 5:00 PM IST
రవిప్రకాష్ పై పవన్ సెటైర్లు.. మళ్లీ రిపీట్
X
వివాదంలో ఇరుక్కొని దాని రవిప్రకాష్ కొట్టుమిట్టాడుతుంటే ఆయన ప్రత్యర్థులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. టీవీ9 వివాదంపై తెలుగు న్యూస్ చానెల్సే కాదు.. జాతీయ మీడియాలోనూ రోజంతా చర్చ జరుగుతోంది. టీవీ9 సీఈవోగా రవిప్రకాష్ ను యాజమాన్యం తొలగించిందని కథనాలు వండివారుస్తున్నారు.. ఇక మీడియాలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ రవిప్రకాష్ పై ట్రోలింగ్ లు, మొమొలు, సెటైర్లు వేస్తూ ఆడుకుంటున్నారు.

ఇక అప్పట్లో శ్రీరెడ్డి వివాదం తలెత్తినప్పుడు.. పవన్ కళ్యాన్ కు వ్యతిరేకంగా.. ఆయన కుటుంబాన్ని కించపరిచేలా మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ వార్తా కథనాలు ప్రసారం చేసిన టీవీ9 - దాని సీఈవో రవిప్రకాష్ పై నాడు పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు మరోసారి ఇప్పుడు బయటకు వచ్చాయి. పవన్ అభిమానులు ఈ ట్వీట్లను బయటకు తీసి.. దుమ్ముదులిపి తమదైన క్రియేటివిటీతో రవిప్రకాష్ ను ఎండగడుతున్నారు.

రవిప్రకాష్ పై నాడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. ‘రవి నిన్ను రియల్ అజ్ఞాతవాసి అని ఎందుకు అన్నానో ఇప్పుడైనా తెలిసిందా?’ అని కౌంటర్ ఇచ్చారు. పవన్ చేసిన ట్వీట్ నే ఇప్పుడు ఆయన అభిమానులు రీట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. రవిప్రకాష్ ను ట్రోల్స్ చేస్తూ తమ కసినంతా తీర్చుకుంటున్నారు.